తెలంగాణ లో రేపటి నుండి విద్యా సంస్థలకు దసరా సెలవులు
- October 12, 2023
హైదరాబాద్: తెలంగాణ లో రేపటి నుండి విద్యా సంస్థలకు దసరా సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. తెలంగాణ ప్రజలు ఎంతో ఘనంగా దసరా పండగను జరుపుకుంటారని సంగతి తెలిసిందే. ప్రభుత్వం సైతం బతుకమ్మ ఉత్సవాలను ప్రతి ఏడాది ఎంతో అట్టహాసంగా జరుపుతూ వస్తుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం విద్యా సంస్థలకు దసరా సెలవులు ప్రకటించింది.రేపు 13వ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి.
13 రోజుల సెలవుల అనంతరం అక్టోబరు 26న బడులు పునఃప్రారంభమవుతాయి. ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులకు సమ్మెటివ్ అసెస్‌మెంట్(ఎస్‌ఏ-1) పరీక్షలు బుధవారంతో ముగిశాయి. ఆ పరీక్షల ఫలితాలు సెలవుల అనంతరం వెల్లడిస్తారు. మరో వైపు ఫార్మెటివ్ అసెస్‌మెంట్-1, 2 పరీక్షల మార్కులను గురువారం లోపు చైల్డ్ ఇన్ఫోలో నమోదు చేయాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. అన్ని జూనియర్ కళాశాలలకు ఈ నెల 19వ తేదీ నుంచి దసరా సెలవులు ప్రారంభమవుతాయి.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







