చంద్రబాబు కు ముందస్తు బెయిల్ మంజూరు
- October 13, 2023
అమరావతి: అంగళ్ల కేసులో చంద్రబాబుకు హైకోర్టు ముందస్తు బెయిల్ ను మంజూరు చేసింది. ఈ కేసులో ఇప్పటికే వాదనలు పూర్తి కావటంతో తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు ఈ రోజు తీర్పు వెల్లడించింది. చంద్రబాబుకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు అంగీకరిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. లక్ష రూపాయలు పూచికత్తు, ఇద్దరు షూరిటీతో బెయిల్ ను ఇచ్చింది. ఇప్పటికే అంగళ్ళుకేసులో 79మందికి ముందస్తు బెయిల్ లభించింది.
ఆగస్టు 4న అంగల్లు మీదుగా చంద్రబాబు వెళ్తున్న సమయంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆ సమయంలో జరిగిన ఘర్షణల్లో పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. ఈ ఘటనలో చంద్రబాబుతో సహా 179 మంది పైన కేసులు నమోదయ్యాయి. దీని పైన పార్టీ నేతలు హైకోర్టును ఆశ్రయించగా విచారణ తరువాత కొందరికి బెయిల్ మంజూరు అయింది. ఇప్పుడు స్కిల్ స్కాంలో రాజమండ్రి జైలులో రిమాండ్ లో ఉన్న చంద్రబాబు ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించారు. కొందరు చంద్రబాబు పైనే రాళ్లు రువ్వారని వాదనల్లో కోర్టుకు వివరించారు. చంద్రబాబు కు రక్షణగా ఉన్న ఎన్ఎస్జీ సిబ్బంది కాపాడారని చెప్పుకొచ్చారు. ఈ పిటీషన్ పై వాదనలు విన్న న్యాయమూర్తి చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరు చేసారు.
తాజా వార్తలు
- యూరప్‌ను వణికిస్తున్న రికార్డు స్థాయి ఎండలు..1,300 మందికి పైగా మృతి
- వాట్సాప్‌లో కొత్త ఫీచర్..ఇక ఫోన్ నంబర్‌కు బదులుగా యూజర్‌నేమ్‌తో చాటింగ్
- ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్..
- డూప్లికేట్ ఓట్ల పై TRS చీఫ్ కవిత కీలక వ్యాఖ్యలు
- ఎతిహాద్ రైల్ ప్రయాణికులకు కీలక మార్గదర్శకాలు..
- యూఏఈలో సాధారణ పాస్‌పోర్ట్, వీసా సేవల నిలిపివేత మరో రోజు పొడిగింపు..
- ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్‌తో ఒమాన్ సుల్తాన్ హైథమ్ భేటీ..
- మూడు నెలల పాటు జరిమానాల్లో 50% తగ్గింపు ప్రకటించిన షార్జా పోలీసులు
- పద్మభూషణ్ డా.నోరి దత్తాత్రేయుడిని ఘనంగా సత్కరించిన మెడికవర్ హాస్పిటల్స్
- డ్రగ్స్ మాఫియా పై ఉక్కుపాదం.. స్మగ్లర్ల ఆస్తుల జప్తు: హోమ్ మంత్రి అనిత







