పుదుచ్చేరి లెఫ్ట్‌నెంట్ జనరల్‌గా కిరణ్ బేదీ
- May 22, 2016
పుదుచ్చేరి లెఫ్ట్‌నెంట్ జనరల్‌గా తనను నియమించడంపై ఐపీఎస్ మాజీ అధికారిణి కిరణ్ బేదీ ఆనందం వ్యక్తంచేశారు. ఇదో అద్భుతమైన అవకాశంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఇలాంటి గొప్ప అవకాశం కల్పించిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. కిరణ్ బేదీని పుదుచ్ఛేరి లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌గా నియమిస్తూ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఆదివారం ఉత్తర్వులు జారీచేసిన సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా కిరణ్ బేదీ మాట్లాడుతూ.. ప్రజల బాధలను అర్థం చేసుకొని వాటిని పరిష్కరించడమే జీవన పరమార్థమన్నారు. ప్రభుత్వానికి పనిచేయడం త్యాగంతో కూడిన సేవన్నారు. ప్రభుత్వ సేవ చేయడం తనకు ఇష్టమని, అందులో చాలా ఆనందం లభిస్తుందన్నారు. సేవచేసే ఇలాంటి బాధ్యతను తనకు అప్పగించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ పదవిని తాను అధికారంగా కాకుండా సేవగా భావిస్తానన్నారు. తనపై నమ్మకంతో ప్రభుత్వం ఉంచిన బాధ్యతను పూర్తిగా నెరవేరుస్తానన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ పౌరులకు విద్యుత్, నీటి బిల్లుల్లో ఊరట..!!
- అబుదాబి–రియాద్ విమాన సర్వీసులు రద్దు.. అక్టోబర్ 19 వరకు నిలిపివేత
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర







