విజయ దశమికే నాని కొత్త ప్రాజెక్ట్‌కి శ్రీకారం.!
- October 14, 2023
నాని - వివేక్ ఆత్రేయ కాంబినేషన్లో ఓ కొత్త ప్రాజెక్ట్ రీసెంట్గా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌ని విజయ దశమి రోజునే పట్టాలెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారట.
పూజా కార్యక్రమాలతో ఈ ప్రాజెక్ట్ ప్రారంభం కానుంది. విజయ దశమి రోజు ఏ పని మొదలు పెట్టినా విఘ్నం లేకుండా పూర్తవుతుంది. విజయం దక్కుతుందన్న నమ్మకం వుంది. అందుకే అదే రోజు నాని తన కొత్త సినిమా ప్రారంభించబోతున్నాడు.
‘దసరా’ సినిమాతో ఫుల్ స్వింగ్‌లో వున్నాడు నాని. ప్రస్తుతం ‘హాయ్ నాన్న’ సినిమాతో బిజీగా వున్నాడు. ఈ సినిమాకీ పాజిటివ్ సైన్ బాగానే కనిపిస్తోంది. ప్రోమోస్ బాగా కట్ చేస్తున్నారు. తండ్రీ కూతురు సెంటిమెంట్‌తో ఈ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే.
మృణాల్ ఠాకూర్ హీరోయిన్ కాగా, శృతి హాసన్ గెస్ట్ రోల్ పోషిస్తోంది. అదలా వుంటే, వివేక్ ఆత్రేయ, నాని కాంబినేషన్లో వచ్చిన ‘అంటే సుందరానికి..’ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అంచనాలు రివర్స్ అయిపోయాయ్ ఈ సినిమా విషయంలో.
కానీ, ఈ సారి అంతకు మించి అంచనాలతో స్ర్కిప్టు సిద్ధం చేశాడట వివేక్ ఆత్రేయ. చూడాలి మరి, ఈ కాంబో ఈ సారైనా హిట్టు కొడుతుందేమో.!
తాజా వార్తలు
- సమ్మర్ రద్దీ నిర్వాహణకు దుబాయ్ విమానాశ్రయం సన్నద్ధం..!!
- ఎడ్యుకేషన్ సిటీలో ఆకట్టుకుంటున్న సమ్మర్ ఆఫ్ డిస్కవరీ..!!
- OCA అధ్యక్ష పదవికి షేక్ జోవాన్ నామినేషన్..!!
- ప్రిన్స్ తుర్కీ బిన్ మహమ్మద్ తో కువైట్ అమీర్, క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- కువైట్ ఎంబసీలో అత్యవసర కేసులకే వీసా సేవలు..!!
- ఖరీఫ్ 2026.. ధోఫార్‌కు తొలి సహాయక దళం: సీడీఏఏ
- ఏపీ కేంద్ర విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- జూలై 1 నుంచి రాబోతున్న మార్పులివే..
- FCRA 2.0 పోర్టల్, ఈ-ఓసీఐ కార్డు ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
- నంద్యాలలో జనసేన నిర్మాణ సారథుల కార్యక్రమం..







