లివర్ సమస్యను ముందుగానే గుర్తించడం ఎలా.?

- October 14, 2023 , by Maagulf
లివర్ సమస్యను ముందుగానే గుర్తించడం ఎలా.?

శరీరంలో అతి ముఖ్యమైన భాగం లివర్. శరీరంలో అతి కీలకమైన 500 పనులను లివర్ నిర్వర్తిస్తుంది. ముఖ్యంగా రక్తాన్ని శుద్ధి చేయడంలో లివర్ కీలక పాత్ర పోషిస్తుంది. జీర్ణక్రియ సక్రమంగా పని చేయడంలోనూ లివర్ పాత్ర కీలకమే.
లివర్ సమస్యలను అస్సలు అశ్రద్ధ చేయరాదని నిపుణులు చెబుతున్నారు. శరీరంలోని విష పదార్ధాలను, అనవసరమైన వ్యర్ధ పదార్ధాలను బయటికి పంపించడంలో లివర్ చాలా యాక్టివ్‌గా పని చేస్తుంది.
అలాగే, ఫ్యాటీ యాసిడ్స్‌ని జీర్ణం చేయడంలోనూ లివర్ ప్రత్యేకంగా పని చేస్తుంది. అంతేకాదు, ఆహారం జీర్ణం చేయడానికి తోడ్పడడంతో పాటూ, జీర్ణమైన ఆహారం నుంచి శరీరానికి కావల్సిన ఎంజైమ్స్‌నీ, ప్రొటీన్స్‌నీ, గుడ్ కొలెస్ర్టాల్‌నీ శరీరానికి అందించి శక్తినివ్వడంలో లివర్ సహాయపడుతుంది.
అందుకే లివర్ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి.. అని నిపుణులు చెబుతున్నారు. లివర్ సమస్యల్ని ముందుగానే గుర్తించడం ఎలా.? సరిగ్గా ఆకలి వేయకపోవడం.. ఇష్టమున్న ఆహారం సైతం నోటికి సహించకపోవడమనేది మన లివర్ ప్రమాదంలో వుందన్నడానికి ఓ ప్రాధమిక సూచన. స
అలాగే ఆహారం జీర్ణం కాకపోవడం కూడా లివర్ అనారోగ్యాన్ని సూచిస్తుంది. సో, అత్యంత సహజ సిద్ధంగానే అనిపించే ఈ సమస్యలు కనిపించినప్పుడు లివర్ టెస్ట్ చేయించుకుని తగు చికిత్స తీసుకోవడం వుత్తమం.!

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com