బిగ్‌బాస్‌కే బిగ్‌బాస్ శివాజీ.! ఏం కంట్రోల్ చేస్తున్నాడు బాస్.!

- October 14, 2023 , by Maagulf
బిగ్‌బాస్‌కే బిగ్‌బాస్ శివాజీ.! ఏం కంట్రోల్ చేస్తున్నాడు బాస్.!

బిగ్‌బాస్ తెలుగు ఏడో సీజన్‌లో చెప్పినట్లే ఏదేదో జరుగుతోంది. ఉల్టా ఫుల్టా అంటూ తలకిందులు చేస్తున్నాడు. ఆటగాళ్లు, పోటుగాళ్లు అంటూ రెండు భాగాలుగా విడదీశాడు హౌస్‌లోని కంటెస్టెంట్లను బిగ్‌బాస్.
అసలు షో స్టార్ట్ అయ్యాకా నెల రోజుల వరకూ కంటెస్టెంట్ల కన్‌ఫామేషనే జరగలేదు. ఇక, కెప్టెన్సీ విషయంలోనూ అదే జరిగింది. తొలి కెప్టెన్‌గా ఎట్టకేలకు గత వారం పల్లవి ప్రశాంత్ ఎంపికవ్వగా.. రెండో కెప్టెన్‌గా ఈ వారం ప్రిన్స్ యావర్ ఆ కెప్టెన్సీ పదవిని దక్కించుకున్నాడు.
ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, శివాజీ హౌస్‌ని భలే కంట్రోల్ చేస్తున్నాడు. పల్లవీ ప్రశాంత్ కెప్టెన్ అవ్వాలి అన్నాడు అయ్యాడు. అలాగే, యావర్‌నీ కెప్టెన్‌గా చూడాలనుకుంటున్నా.. అన్నాడు. అలాగే అయ్యాడు. ఇలా బిగ్‌బాస్ కను సన్నల్లో కాదు, శివాజీ కనుసన్నల్లో షో నడుస్తోందనిపిస్తోంది చూసేవాళ్లకి.
హౌస్‌లో వున్న కొందరికి శివాజీ ఆటిట్యూడ్ నచ్చడం లేదు. కానీ, హౌస్‌ని మాత్రం కూల్ అండ్ కామ్‌‌గా ఎంతో చాకచక్యంగా చాణక్యుని మాదిరి కంట్రోల్ చేస్తున్నాడు శివాజీ.  
అర్హత వున్నా లేకున్నా.. తాను అనుకున్న వాళ్లనే ఇద్దరినీ హౌస్‌కి కెప్టెన్స్ చేయడంలో శివాజీ పాచికలు పారాయ్. చూడాలి మరి, బిగ్‌బాస్ హౌస్‌లో ముందు ముందు ఏం ‘బిగ్’ ట్విస్ట్‌లు జరుగుతాయో.!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com