అయ్యో లియో.! అనుకున్నదొక్కటి అయినది ఇంకొక్కటి.!
- October 14, 2023
‘లియో’ సినిమాకి బెనిఫిట్ ఫోలకు అనుమతినిచ్చి తమిళనాడు ప్రభుత్వం తన ఉదారతను చాటుకుంది.. అనే లోపు మరో ట్విస్ట్ ‘లియో’ ప్రియులను షాక్‌కి గురి చేసింది.
‘లియో’ ఐదు షోలకు అనుమతినిచ్చింది తమిళనాడు ప్రభుత్వం. అయితే, ఎర్లీ అవర్స్‌లో వేయబోయే బెనిఫిట్ షోలకు అనుమతి లేదని తాజాగా షాకిచ్చింది. ఇచ్చినట్లే ఇచ్చి ఆఫర్ ఇలా చిక్కుల్లో పెట్టడంతో విజయ్ అభిమానులు మళ్లీ గుస్సా అవుతున్నారు.
ఉదయం 4 గంటల నుంచి 9 గంటల లోపు రెండు షోలు ప్రదర్శించుకోవచ్చని అనుకున్నారు. కానీ, 9 గంటల తర్వాతే ధియేటర్లో బొమ్మ పడాలి.. అని షరతులతో కూడిన అనుమతినిచ్చింది స్టాలిన్ గవర్నమెంట్.
దాంతో, 9 గంటల లోపు షో వేసేందుకు అభ్యంతరాలొచ్చి పడ్డాయ్. బెనిఫిట్ షోలతోనే ఫుల్‌గా బిజినెస్ చేసుకోవచ్చనుకున్న ‘లియో’ నిర్మాతల టీమ్‌కి ఇదో రకంగా గట్టి దెబ్బే అని చెప్పొచ్చేమో.
అదేంటో.! ‘లియో’ సినిమాతో విజయ్‌కి ఇన్ని రకాల అడ్డంకులేంటో.! ప్రీ రిలీజ్ ఫంక్షన్ అడ్డుకున్నారు. సర్లే.. బెనిఫిట్ షోలకు అనుమతిచ్చారు కదా.. అనుకుంటే.. ఏంటీ షరతులు గోవిందా.!
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







