‘రాక్షస రాజు’గా రానున్న రానా.!
- October 14, 2023
‘నేనే రాజు నేనే మంత్రి’ అంటూ తేజ డైరెక్షన్‌లో రానా ఓ సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా అటు రానాకీ, ఇటు తేజకీ మంచి హిట్ అందించింది.
అప్పటికే గ్యాప్ తీసుకుని వున్న తేజకి మంచి కమ్ బ్యాక్ మూవీగా నిలిచింది ఈ సినిమా. అప్పుడే రానాతో ఇంకో సినిమాకీ తేజ కమిట్ అయ్యాడు. ఆ తర్వాత ఏవేవో సినిమాలు చేసి కిందా మీదా పడ్డాడు.
అన్నట్లు ఇటీవలే రానా సోదరుడు అభిరామ్‌తోనే ‘అహింస’ సినిమా తెరకెక్కించి బోల్తా కొట్టేశాడు కూడా. ఇప్పుడు మళ్లీ రానాతోనే ఇంకో సినిమా పట్టాలెక్కించబోతున్నాడు. అదే ‘రాక్షస రాజు’. ఈ సినిమా విజయ దశమి సందర్భంగా ఈ నెలలోనే లాంఛింగ్ కాబోతోంది.
అలాగే రానా ఇంకో వైపు ‘హిరణ్య కశ్యప’ సినిమాలోనూ నటిస్తున్నాడు. గుణ శేఖర్ దర్శకత్వంలో తెరకెక్కాల్సిన ఈ సినిమాకి మరో డైరెక్టర్‌తో తెరకెక్కిస్తున్నాడు రానా. ఈ సినిమా నిర్మాణంలోనూ రానా ఓ చేయి వేయబోతున్నాడనీ తెలుస్తోంది.
గుణ శేఖర్ ప్రోద్భలంతోనే ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యింది కానీ, గుణ శేఖర్ ప్రస్తుతం వున్న పరిస్థితుల్లో ఈ ప్రాజెక్ట్ ఆయనకి అంత ఆషా మాషీ కాదనుకున్నాడు కాబోలు.. సడెన్‌గా రానా తన చేతుల్లోకి తీసుకున్నాడు. ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్ట్‌ని పట్టాలెక్కిస్తున్నాడట రానా. త్వరలోనే పూర్తి డీటెయిల్స్ రివీల్ కానున్నాయ్.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







