ఒమానీ మహిళా దినోత్సవం.. ROHM వార్షిక కచేరీ
- October 16, 2023
మస్కట్: రాయల్ ఒపెరా హౌస్ మస్కట్ (ROHM) ఒమానీ మహిళా దినోత్సవం సందర్భంగా అక్టోబర్ 17న వార్షిక కచేరీని ప్రదర్శించనుంది. ఒమన్‌లో జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ వార్షిక ఈవెంట్ ను నిర్వహించనున్నారు. ఒమన్ సుల్తానేట్ మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న గొప్ప మహిళలు ఈ వేడుకలో పాల్గొనే అవకాశం కల్పిస్తుంది. రాయల్ ఒపేరా హౌస్ మస్కట్ ఈ ఈవెంట్ కోసం ప్రేక్షకులను ఆహ్వానిస్తుంది. పరిశ్రమ, కళలు, సైన్స్, విద్యాసంస్థలు, ప్రజా సేవలో మహిళల వరకు జీవితంలోని అన్ని రంగాలలో స్ఫూర్తిదాయకమైన మహిళలకు హృదయపూర్వక అభినందనలు తెలియజేయడానికి ఇది ఒక అవకాశం అని ప్రకటించింది. ఈ సమావేశంలో మహిళల సంగీత ప్రదర్శన కూడా ఉంటుందని నిర్వాహకులు వెల్లడించారు. అల్ నూర్ వాల్ అమల్ లేడీస్ ఆర్కెస్ట్రా శాస్త్రీయ సంగీతాన్ని ప్లే చేసే అంధ సంగీతకారుల ఏకైక ఆర్కెస్ట్రాగా గుర్తింపు పొందిందని, అంతర్జాతీయ స్థాయిలో ప్రదర్శన ఇస్తుందని, ఆర్కెస్ట్రా వారి అసాధారణ ప్రతిభకు నిదర్శనంగా నిలుస్తుందని పేర్కొంది. మజిదా ఎల్ రౌమి ప్రఖ్యాత గాయని సూపర్ స్టార్ పాల్గొంటారని తెలిపారు.
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్‌లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్‌తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







