ఉద్యోగాలు అమ్ముకుంటున్న కుంభకోణం..టీసీఎస్‌లో 19 మంది పై వేటు
- October 16, 2023
ముంబై: బ్యాక్ డోర్ ద్వారా ఉద్యోగాలను అమ్ముకుంటున్న కుంభకోణం ప్రముఖ ఐటీ సంస్థ టీసీఎస్ లో వెలుగులోకి వచ్చింది. ఈ అక్రమాలకు పాల్పడిన 19 మందిపై టీసీఎస్ వేటు వేసింది. ఈ విషయాన్ని టీసీఎస్ యాజమాన్యం నిన్న అధికారికంగా ప్రకటించింది. తాము జరిపిన విచారణలో రిక్రూట్ మెంట్ స్కామ్ లో 19 మంది ఉద్యోగుల పాత్ర ఉన్నట్టు గుర్తించామని తెలిపింది. ఈ 19 మందిలో 16 మంది ఉద్యోగులను టీసీఎస్ తొలగించగా, మరో ముగ్గురిని రిసోర్స్ మేనేజ్ మెంట్ నుంచి తొలగించారు. ఈ స్కామ్ ఈ ఏడాది జూన్ లో వెలుగులోకి వచ్చింది. వెంటనే కంపెనీ దర్యాప్తు చేపట్టింది. నాలుగు నెలలు దర్యాప్తు చేసిన అనంతరం స్కామ్ కు పాల్పడిన వారిపై కంపెనీ చర్యలు తీసుకుంది. రానున్న కాలంలో కార్పొరేట్ గవర్నెన్స్ ను మరింత బలోపేతం చేస్తామని టీసీఎస్ తెలిపింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







