చిలగడ దుంప ఆమ్లెట్
- May 22, 2016
కావలసిన పదార్థాలు: చిలగడదుంప తురుము - ఒకటిన్నర కప్పులు, తరిగిన ఉల్లి - 1, వెల్లుల్లి తరుగు - 1 టీ స్పూను, పసుపు - పావు టీ స్పూను, ఉప్పు + మిరియాల పొడి - రుచికి తగినంత, గుడ్లు - 3, బేకింగ్ సోడా - అర టీ స్పూను, నూనె - 2 టీ స్పూన్లు.
తయారుచేసే విధానం: నూనెలో ఉల్లి, వెల్లుల్లి, పసుపు వేగించి చిలగడ తురుము కలపాలి. 3 నిమిషాల తర్వాత ఉప్పు, మిరియాలపొడి చల్లి మగ్గించి చల్లారనివ్వాలి. గుడ్ల సొనలో బేకింగ్ సోడా, చిటికెడు పసుపు వేసి బాగా గిలకొట్టి చిలగడ మిశ్రమం కలపాలి. దీన్ని నూనె రాసిన పాత్రలో పోసి 375 డిగ్రీల వద్ద ప్రీ హీట్ చేసిన ఒవెన్‌లో 25 నిమిషాలు ఉంచి తీసెయ్యాలి. ఈ ఆమ్లెట్‌ను పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు.
తాజా వార్తలు
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
- దుబాయ్‌లో ఘనంగా ‘ఇసుక తిన్నెల పై బతుకమ్మ’ పాట ఆవిష్కరణ
- ఖతార్‌లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్‌రౌండర్.. !
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!







