విశాఖపట్నంలో ఇన్ఫోసిన్ కార్యాలయాన్ని ప్రారంభించిన సిఎం జగన్
- October 16, 2023
అమరావతి: సిఎం జగన్ విశాఖ చేరుకున్నారు. విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో ఆయన విశాఖకు వెళ్లారు. ఈ సందర్భంగా మధురవాడలో ఇన్ఫోసిస్ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఇన్ఫోసిస్ తో పాటు వివిధ ఐటీ కంపెనీల ప్రతినిధులతో జగన్ కాసేపు సంభాషించనున్నారు. అనంతరం ఆయన పరవాడలోని ఫార్మాసిటీకి బయల్దేరుతారు. అక్కడ స్టెర్లీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని ప్రారంభిస్తారు. అనంతరం లారెస్ ల్యాబ్ కు చేరుకుని యూనిట్-2ను ప్రారంభిస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3.20 గంటలకు విశాఖ ఎయిర్ పోర్ట్ కు చేరుకుని అక్కడి నుంచి విజయవాడకు బయల్దేరుతారు.
కాగా, సీఎంతో పాటు వైవీ సుబ్బారెడ్డి, విడదల రజని ఉన్నారు. ఎయిర్ పోర్టులో జగన్ కు వైఎస్‌ఆర్‌సిపి నేతలు గుడివాడ అమర్ నాథ్, కరణం ధర్మశ్రీ, బూడి ముత్యాల నాయుడు, ఎంపీ సత్యవతి, ఎంపీ సత్యనారాయణ తదితరులు స్వాగతం పలికారు. ఎయిర్ పోర్ట్ నుంచి హెలికాప్టర్ లో మధురవాడకు జగన్ బయల్దేరారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







