గాజా ఆసుపత్రి దాడి పై ప్రధాని మోదీ విచారం..
- October 18, 2023
న్యూ ఢిల్లీ: గాజాలోని అల్ అహ్లీ ఆసుపత్రి పై జరిగిన దాడిపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. ఈ విషయంలో దోషులు ఎవరైనప్పటికీ వారిని విడిచిపెట్టవద్దని అన్నారు. మంగళవారం (17 అక్టోబర్ 2023) గాజాలోని అల్-అహ్లీ ఆసుపత్రి మీద జరిగిన వైమానిక దాడిలో సుమారు 500 మంది పౌరులు మరణించారు. దీనిపై ప్రధాని తన సోషల్ మీడియా ఖాతా ఎక్స్ ద్వారా స్పందిస్తూ “ఈ యుద్ధంలో పౌరులు మరణించడం తీవ్ర ఆందోళన కలిగించే విషయం. ఈ దాడికి బాధ్యులను విడిచిపెట్టకూడదు” అని పోస్ట్ చేశారు.
ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం జరుగుతోంది. ఈ నేపథ్యంలో గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేస్తోంది. ఉపరితల బలగాలు కూడా ఉత్తర గాజాపై దాడి చేస్తున్నాయి. వాస్తవానికి మూడు రోజుల ముందే ఉత్తర గాజాలోని ప్రజలను ఖాళీ చేయమంటూ ఇజ్రాయెల్ ఆదేశించింది. అక్కడున్న ఆసుపత్రిని కూడా ఖాళీ చేయమని హెచ్చరించారు. అనంతరం ఈ దాడి జరిగింది. మంగళవారం అర్థరాత్రి ఈ ఆసుపత్రిపై వైమానిక దాడి జరిగింది. పాలస్తీనాలోని హమాస్ నియంత్రణలో ఉన్న ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం.. ఇక్కడ నివసిస్తున్న 500 మంది మరణించినట్లు వార్తలు వచ్చాయి. అప్పటి నుంచి గాజా ఆస్పత్రిపై ఇజ్రాయెల్ దాడి చేసి, పౌరులను చంపేశారంటూ విమర్శలు వస్తున్నాయి.
గాజాలోని ఆసుపత్రిపై దాడిలో అనేక మంది పౌరులు ప్రాణాలు కోల్పోవడంపై ఐక్యరాజ్యసమితి, దాని అగ్రనేతలు, ఏజెన్సీలు తీవ్ర విచారం వ్యక్తం చేశాయి. అలాగే ఈ సంఘటనను తీవ్రంగా ఖండించాయి. ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ ద్వారా స్పందిస్తూ.. గాజాలోని ఆసుపత్రిపై ఈ రోజు జరిగిన దాడిలో వందలాది మంది పాలస్తీనియన్లు మరణించినందుకు తను చాలా బాధపడ్డానని, తాను దానిని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని, గాజాలోని ఆసుపత్రులు, వైద్య సిబ్బంది అంతర్జాతీయ మానవతా చట్టం కింద రక్షణ పొందుతారని గటెర్రస్ అన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం..
- 12 ఏళ్ల బాలుడికి 3D మ్యాపింగ్‌తో అరుదైన గుండె సమస్యకు విజయవంతమైన చికిత్స
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!
- ఖతార్‌లో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం..!!
- 459 మంది ఖైదీలకు ఒమన్ సుల్తాన్ క్షమాభిక్ష..!!
- సౌదీలో ఉరుములు, పిడుగులతో వర్షాలు.. 46 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!







