ఒమన్ లో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలకు 2 రోజుల సెలవు
- October 23, 2023
యూఏఈ: తేజ్ తుఫాన్ ఒమన్ సుల్తానేట్ను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా అధికారులు అక్టోబర్ 23-24 (సోమవారం, మంగళవారం) దోఫర్ గవర్నరేట్‌లోని ప్రభుత్వ, ప్రైవేట్ రంగ ఉద్యోగులకు.. అల్ వుస్తా గవర్నరేట్‌లోని అల్ జజీర్ విలాయత్‌కు అధికారిక సెలవులను ప్రకటించారు. తేజ్ తుఫాను కారణంగా గల్ఫ్ దేశం ప్రతికూల వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటోంది. ధోఫర్ గవర్నరేట్, అల్ వుస్తా గవర్నరేట్‌లోని చాలా ప్రాంతాలు నేరుగా ప్రభావితం అయ్యాయి. ఈ క్రమంలో ఒమన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తన 24-గంటల కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. ప్రజలు జాగ్రత్త వహించాలని, లోయలను దాటవద్దని, లోతట్టు ప్రాంతాలకు దూరంగా ఉండాలని సివిల్ ఏవియేషన్ అథారిటీ సూచించింది. తాజా ఉపగ్రహ చిత్రాలు ప్రకారం.. తేజ్ తుఫాన్ కేటగిరి 3 తుఫానుగా మారుతున్నట్లు అధికారులు తెలిపారు. ఇది ప్రస్తుతం ఒమన్ యొక్క సమీప తీరానికి దాదాపు 500 కి.మీ దూరంలో ఉందని, సోమవారం, మంగళవారాల్లో తుఫాన్ తీవ్రత అధికంగా ఉంటుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!







