ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదానికి ముగింపు పలకాలి: పోప్ ఫ్రాన్సిస్
- October 23, 2023
యూఏఈ: ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదానికి ముగింపు పలకాలి పోప్ ఫ్రాన్సిస్ ఆదివారం కోరారు. గాజా స్ట్రిప్‌లోకి మానవీయ సహాయాన్ని అనుమతించాలని పిలుపునిచ్చారు. "యుద్ధం ఎప్పుడూ ఓటమే. ఇది మానవ సౌభ్రాతృత్వ విధ్వంసం. సోదరులారా యుద్ధాన్ని ఆపండి.’’ అని రోమ్‌లోని సెయింట్ పీటర్స్ స్క్వేర్‌లో తన సాంప్రదాయ ఏంజెలస్ ప్రార్థన తర్వాత ఫ్రాన్సిస్ ప్రకటన చేశారు. గాజా ప్రజలకు మానవతా సహాయం అందించడం కొనసాగించాలని, బందీలను విడిపించాలని 86 ఏళ్ల పోప్ పిలుపునిచ్చారు.
హమాస్ మిలిటెంట్లు అక్టోబరు 7న గాజా స్ట్రిప్ నుండి ఇజ్రాయెల్‌లోకి రాకెట్ దాడులు చేసారు. ఇందులో కనీసం 1,400 మంది చనిపోగా.. పలువురు ఇజ్రాయెల్ వాసులను హమాస్ ఉగ్రవాదులు బందీలుగా చేసుకున్నారు. అనంతరం ఇజ్రాయెల్ ప్రతీకార బాంబు దాడుల్లో 4,300 మంది వరకు పాలస్తీనియన్లు మరణించారు. ఈ క్రమంలో గాజాకు నీరు, ఆహారం, విద్యుత్ సరఫరాలను ఇజ్రాయెట్ అడ్డుకున్నది. తాజాగా అంతర్జాతీయ సమాజం ఒత్తిడి మేరకు ఇద్దరు అమెరికన్ బందీలను విడుదల చేసింది హమాస్. అలాగే యూఎన్ సహాయక సామగ్రిని గాజాలోకి అనుమతించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







