యూట్యూబ్ వీడియోలను లైక్ చేసి రూ.73 లక్షలు పోగొట్టుకున్నారు
- October 23, 2023
హర్యానా: యూట్యూబ్ వీడియోలను లైక్ చేయడం ద్వారా భారీ మొత్తం ఆర్జించవచ్చని మభ్యపెట్టి పలువురి నుంచి రూ.73 లక్షలు కాజేసిన ముఠా సభ్యుల్లో ఒకరైన 28 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. యూట్యూబ్, మోజ్ యూప్ ల పేరుతో ఈ గ్యాంగ్ ఆన్ లైన్ మోసానికి పాల్పడింది. నిందితుడు హరియాణాకు చెందిన సోనేపట్ వాసి అజయ్ కుమార్ ను గురుగ్రాంలో అరెస్టు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కుమార్ అనే వ్యక్తి గురుగ్రామ్ కు చెందిన ఓ వ్యక్తికి వాట్సాప్ ద్వారా లింక్ పంపాడు. యూట్యూబ్ కంటెంట్ ను లైక్ చేయడం ద్వారా పెద్ద మొత్తంలో ఆర్జించవచ్చని నమ్మించాడు. ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయాలని మభ్యపెట్టాడు.
ఆపై కుమార్ పలుమార్లు ఇన్వెస్ట్ చేస్తూ పెద్ద మొత్తంలో నష్టపోయారు. ఈ విధంగా మరికొందరినీ మోసం చేసి పెద్ద మొత్తంలో బురిడీ కొట్టించాడు. ఈ కేసులో ఇతర నిందితుల బ్యాంకు ఖాతాలకు కూడా డబ్బు చేరవేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్‌ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్‌లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- Kuwait air defences intercept Iranian missile, drone attacks
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక







