2024-25లో యూనిఫైడ్ జిసిసి వీసా
- October 24, 2023
యూఏఈ : గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ దేశాలకు ఏకీకృత టూరిస్ట్ వీసా ఆమోదం పొందిందని, వచ్చే ఏడాది ప్రారంభంలో దీనిని ప్రారంభించనున్నట్లు యూఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ టౌక్ అల్ మర్రి తెలిపారు. మస్కట్‌లో జరిగిన GCC మంత్రుల సమావేశంలో స్కెంజెన్-శైలి వీసాను ఆమోదించినట్లు పేర్కొన్నారు. దీనితో ఒకే వీసాతో పర్యాటకులు ఆరు గల్ఫ్ దేశాలను సందర్శించవచ్చు. ఈ వీసాను 2024 -25లో అమలులోకి తేవాలని భావిస్తున్నారు.
యూఏఈ యొక్క ఆర్థిక వ్యవస్థకు పర్యాటకం రంగం ప్రధాన ఆదాయ వనరుగా ఉంది. GDPలో 14 శాతం వాటా కలిగి ఉంది. దీనిని 18 శాతానికి పెంచాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి చెప్పారు.2023 మొదటి అర్ధభాగంలో 8.55 మిలియన్ల అంతర్జాతీయ సందర్శకులు యూఏఈని సందర్శించినట్లు పేర్కొన్నారు. మరోవైపు ఈ స్కెంజెన్-శైలి టూరిస్ట్ వీసాతో జీసీసీ దేశాల ఆర్థిక వ్యవస్థలకు గేమ్ ఛేంజర్‌గా మారుతుందని, ఈ ప్రాంతంలోని పౌరులు మరియు నివాసితులకు అనేక ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తుందని హోటల్ యజమానులు, ట్రావెల్ ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్‌లు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







