8 నెలలలో ఈ-స్కూటర్ ప్రమాదాల్లో 5 మంది మృతి, 29 మందికి గాయాలు
- October 25, 2023
దుబాయ్: గత ఎనిమిది నెలలుగా దుబాయ్‌లో జరిగిన ఈ-స్కూటర్ ప్రమాదాల్లో ఐదుగురు మృతి చెందగా, 29 మంది గాయపడ్డారు. ఇ-స్కూటర్లపై 32 ప్రమాదాలు నమోదుఖ్యినట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి తీవ్రంగా ఉందని పేర్కొన్నారు.
ఎనిమిది నెలల్లో రైడర్లపై 10,000 జరిమానాలు విధించినట్లు ట్రాఫిక్ విభాగం డైరెక్టర్ మేజర్ జనరల్ సైఫ్ ముహైర్ అల్ మజ్రోయి తెలిపారు. రైడర్లు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడుతున్న వీడియోను పోలీసులు తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇతరుల ప్రాణాలకు హాని కలిగించే రైడర్లపై 300 దిర్హామ్‌ల జరిమానా విధించబడుతుందని, 16 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు ఇ-స్కూటర్‌ను నడపడం వంటి ఉల్లంఘనలను వీడియోలో చూపించారు. ఈ-స్కూటర్ రైడర్లు అన్ని సంబంధిత భద్రతా నియమాలను పాటించాలని అధికారి కోరారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







