'హమాస్ బాగా చూసుకుంది.. విడుదలైన ఇజ్రాయెలీ బందీ
- October 25, 2023
యూఏఈ: అక్టోబర్ 7న గాజాలోకి తీసుకువెళ్లినప్పుడు మిలిటెంట్లు తనను కొట్టారని, అయితే పాలస్తీనా ఎన్‌క్లేవ్‌లో ఆమె రెండు వారాల బందీగా ఉన్న సమయంలో బాగా చూసుకున్నారని హమాస్ విడుదల చేసిన ఒక వృద్ధ ఇజ్రాయెలీ బందీ తెలిపారు. 85 ఏళ్ల యోచెవ్డ్ లిఫ్షిట్జ్ ను సోమవారం విడుదల చేసారు.ఆమెతో పాటు మరో మహిళను హమాస్ విడుదల చెసింది. ఇంకా దాదాపు 220 మంది బందీలు హమాస్ దగ్గర ఉన్నట్లు భావిస్తున్నారు. ఆమెను మోటర్‌బైక్‌పై ఎక్కించుకుని తన కిబ్బుట్జ్ నుండి సమీపంలోని గాజాలోకి తీసుకెళ్లినట్లు చెప్పింది. తనను స్పైడర్ వెబ్‌తో పోలిన సొరంగాల్లోకి తీసుకెళ్లారని ఆమె చెప్పింది. తనను ఒక డాక్టర్ పరిశీలించాడని, ఇజ్రాయెల్‌లో తీసుకుంటున్న మందులనే అందించారని లిఫ్షిట్జ్ చెప్పారు. ఇజ్రాయెల్ సైన్యం హమాస్ ముప్పును తగినంత సీరియస్‌గా తీసుకోలేదని ఆమె అభిప్రాయబడ్డారు. గాజాలో ఇప్పటికీ బందీలుగా ఉన్న 200 మందికి పైగా బందీలలో 80 ఏళ్ల తన భర్త కూడా ఉన్నాడని తెలిపింది. క్రీమ్ చీజ్, కరిగించిన చీజ్, దోసకాయలతో పిటాస్ ను భోజనంగా అందించారని లిఫ్షిట్జ్ చెప్పారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







