కారు కిటికీల నుండి చెత్తను విసిరితే Dh1,000 జరిమానా
- October 26, 2023
యూఏఈ: అబుదాబి సిటీ మునిసిపాలిటీ నిర్వహించిన కార్యక్రమంలో అబుదాబి పోలీస్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ అండ్ పెట్రోల్స్ పాల్గొని..ట్రాఫిక్ నిబంధనలను పాటించకపోతే జరిగే ప్రమాదాలపై అవగాహన కల్పించింది. షఖ్‌బౌట్ సిటీ స్కూల్స్, అల్ అహ్ల్యా హాస్పిటల్, అబుదాబి వేస్ట్ మేనేజ్‌మెంట్ కంపెనీ, అబుదాబి సివిల్ డిఫెన్స్ అథారిటీ సహకారంతో జాయెద్ సిటీలోని రబ్దాన్ పార్క్‌లో 'అవర్ సిటీ ఈజ్ బ్యూటిఫుల్' అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. కమ్యూనిటీ సభ్యులకు ట్రాఫిక్ భద్రతా నిబంధనలను పాటించాలని ట్రాఫిక్ మరియు పెట్రోల్స్ డైరెక్టరేట్ డైరెక్టర్ డీన్ మహమూద్ యూసఫ్ అల్ బలూషి చెప్పారు.ఈ సందర్భంగా ఆయన కుటుంబాలు, పిల్లలను పబ్లిక్ రోడ్లపై ఇ-స్కూటర్లను ఉపయోగించడం వల్ల కలిగే ప్రమాదాల గురించి హెచ్చరించారు. సరైన రక్షణ పరికరాలతో నిర్దేశించిన ప్రదేశాలలో మాత్రమే ఈ స్కూటర్లను ఉపయోగించాలని సూచించారు. గత ఎనిమిది నెలలుగా ఎమిరేట్‌లో జరిగిన అనేక ఇ-స్కూటర్ ప్రమాదాలలో ఐదుగురు మరణించారని, 29 మంది గాయపడ్డారని వెల్లడించారు.
దుబాయ్‌లోని ట్రాఫిక్ విభాగం డైరెక్టర్ మేజర్-జనరల్ సైఫ్ ముహైర్ అల్ మజ్రోయి మాట్లాడుతూ.. గత ఎనిమిది నెలల్లో రైడర్‌లపై 10,000 జరిమానాలు విధించినట్లు పేర్కొన్నారు. ఇ-స్కూటర్ల రైడర్ల నిర్లక్ష్యం కారణంగా 32 ప్రమాదాలు జరిగాయని, ఇందులో రెండు తీవ్రమైనవి కాగా, 14 మోస్తరు, 13 చిన్న కేసులు ఉన్నాయని తెలిపారు. అబుదాబి కార్యక్రమంలో డైరెక్టరేట్ పబ్లిక్ రిలేషన్స్ డిపార్ట్‌మెంట్ నుండి అసిస్టెంట్ తారిఖ్ ముహమ్మద్ హమిదాన్ శీతాకాలపు సెలవుల్లో పిల్లలను గమనించవలసిన అవసరంపై అవగాహన కల్పించారు. పిల్లలను బిజీగా ఉంచడంతోపాటు ఈ-స్కూటర్ల వాడకం వల్ల కలిగే ప్రమాదాల నుంచి వారిని కాపాడాలని సూచించారు. డ్రైవింగ్ చేసేటప్పుడు వాహనాల నుండి వ్యర్థాలను రోడ్డుపై విసిరేయడంపై అబుదాబి పోలీసులు ప్రత్యేకంగా ప్రస్తావించారు. అటువంటి ఉల్లంఘన విషయంలో ట్రాఫిక్ చట్టంలోని ఆర్టికల్ 71 వర్తించబడుతుందని, 1,000 దిర్హామ్ జరిమానా విధించబడుతుందని, అలాగే డ్రైవింగ్ లైసెన్స్‌పై ఆరు బ్లాక్ పాయింట్లు విధించబడతాయని హెచ్చరించారు.
తాజా వార్తలు
- తెలంగాణలో ₹1,000 కోట్ల స్టార్టప్ ఫండ్ ప్రకటించిన సీఎం రేవంత్
- తిరుమలలో మరో స్కామ్: నకిలీ పట్టు దుపట్టా మోసం
- మాలికి ట్రావెల్ బ్యాన్..వెంటనే తిరిగిరండి..!!
- ఒమన్ లో అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం..!!
- దర్బ్ అల్ సయ్ లో నేషనల్ డే కార్యకలాపాలు..!!
- సౌదీ అరేబియాలో సీజనల్ రెయిన్ ఫాల్..!!
- మనమా సౌక్.. మనమా ఆత్మ, హార్ట్ బీట్..!!
- కువైట్ చేరిన ఇండియన్ కోస్ట్ గార్డు షిప్ సర్థాక్..!!
- ఎన్నికల తేదీల కోసం జనాల ఎదురు చూపులు: కేటీఆర్
- దేశ ప్రజలకు ప్రధాని మోదీ కీలక విజ్ఞప్తి..!







