ఇజ్రాయెల్‌ దాడి..ముగ్గురు హమాస్‌ కీలక కమాండర్లు హతం

- October 27, 2023 , by Maagulf
ఇజ్రాయెల్‌ దాడి..ముగ్గురు హమాస్‌ కీలక కమాండర్లు హతం

హమాస్: ప్రతీకార దాడులతో హమాస్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఇజ్రాయెల్ మరో విజయం సాధించింది. ఇజ్రాయెల్ ఫైటర్ జెట్ల దాడిలో దరాజ్ తుఫా బెటాలియన్‌కు చెందిన ముగ్గురు హమాస్ సీనియర్ ఉగ్రవాదులు హతమయ్యారు. ఇజ్రాయెల్ మిలటరీ ఈ విషయాన్ని వెల్లడించింది. హతమైన వారిని బెటాలియన్ డిప్యూటీ కమాండర్ ఇబ్రహీం జద్బా, కమాండర్ రిఫత్ అబ్బాస్, కంబాట్ సపోర్ట్ కమాండర్ తారెక్ మారౌఫ్ ఉన్నట్టు పేర్కొంటూ వారి ఫొటోలను విడుదల చేసింది.

ఈ నెల 7న ఇజ్రాయెల్ భూభాగంలోకి దూసుకొచ్చి దాడులకు తెగబడడంలో ఈ బెటాలియన్ కీలక పాత్ర పోషించినట్టు పేర్కొంది. హమాస్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్‌లో ఈ బ్రిగేడ్‌ను అత్యంత ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. ఇజ్రాయెల్ సెక్యూరిటీ ఏజెన్సీ షిన్‌బెట్ మార్గదర్శకత్వంలో హమాస్ ఉగ్రవాదులను అంతం చేసినట్టు తెలిపింది. కాగా, నిన్న ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో హమాస్ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ డిప్యూటీ హెడ్ షాదీ బరుద్ హతమైనట్ట పేర్కొంది. ఇజ్రాయెల్‌పై దాడికి పథక రచనలో అతడి పాత్ర కూడా ఉన్నట్టు వివరించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com