ఎట్టకేలకు హీరోయిన్గా బిగ్‌బాస్ బ్యూటీ.!
- October 30, 2023
బుల్లితెర బిగ్ గేమ్ షో బిగ్ బాస్ చాలా మందికి కెరీర్ పరంగా హెల్ప్ అయ్యిందని చెప్పొచ్చు. బిగ్‌బాస్ షో ద్వారా వచ్చిన ఫేమ్‌తో కొందరు హీరోలూ, హీరోయిన్లుగా రాణించడమే కాదు, బోలెడంత పాపులారిటీ దక్కించుకున్న సంగతి తెలిసిందే.
తాజాగా బిగ్‌బాస్ ఫేమ్ దేత్తడి హారిక త్వరలో హీరోయిన్గా తెరంగేట్రం చేయబోతోంది. ఎప్పటి నుంచో యూ ట్యూబర్‌గా బోలెడంత పాపులారిటీ వున్న దేత్తడి హారిక, బిగ్‌బాస్‌తో మరింత ఫేమ్ సంపాదించుకుంది.
లేటెస్ట్గా సాయి రాజేష్ రూపొందిస్తున్న ఓ సినిమా కోసం హీరోయిన్గా ఎంపికైంది. వెరీ లేటెస్ట్గగా ఈ సినిమా స్టార్ట్ అయ్యింది. ఓ బ్యూటిపుల్ రొమాంటిక్ లవ్ స్టోరీగా ఈ సినిమా వుండబోతోందనీ లాంఛింగ్ పోస్టర్ ద్వారా హింట్ ఇచ్చేశారు. నిర్మాతగా అభిరుచి గల సినిమాలను రూపొందించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సాయి రాజేష్, ఇటీవలే ‘బేబీ’ సినిమాతో వైష్ణవీ చైతన్యను హీరోయిన్గా పరిచయం చేసి, సెన్సేషనల్ హిట్ అందుకున్నాడు.
ఇప్పుడు మరో యూ ట్యూబర్ కమ్ బిగ్‌బాస్ బ్యూటీ అయిన దేత్తడి హారిక టైమొచ్చింది. ఎప్పటి నుంచో సినిమాల్లో రాణించాలనుకున్న దేత్తడి హారిక కోరిక ఇన్నాళ్లకు తీరబోతోంది. హీరోయిన్ ఫ్రెండ్ తరహా సైడ్ క్యారెక్టర్లలో ఆల్రెడీ సినిమాల్లో నటించిన అనుభవం వున్న హారిక సాయి రాజేష్ పుణ్యమా అని హీరోయిన్గా ప్రమోట్ అయ్యిందిప్పుడు.
సంతోష్ శోభన్ హీరోగా రూపొందుతోన్నఈ సినిమా తాజాగా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలైంది. అక్కినేని నాగ చైతన్య ఈ పూజా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్‌లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్‌లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







