ఆయన బయోపిక్ అయితే నటిస్తా - విక్టరీ వెంకటేష్.!
- October 30, 2023
విక్టరీ వెంకటేష్‌కి క్రికెట్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చాలా సార్లు క్రికెట్ మ్యాచ్‌ల వద్ద యాక్టివ్‌గా ఆయన పార్టిసిపేట్ చేయడం చూశాం. తాజాగా వరల్డ్ కప్ జరుగుతున్ననేపథ్యంలో అహ్మదాబాద్‌లో దర్శనమిచ్చారాయన.
ఇండియా టీమ్‌ని ఎంకరేజ్ చేస్తూ దగ్గరుండి విక్టరీ అందించినంత పని చేశారు. ఈ సందర్భంగా కామెంటేటర్ అడిగిన ప్రశ్నకు బదులుగా ఆయన తన మనసులోని మాట బయట పెట్టారు. ఒకవేళ ఏ క్రికెటర్ బయోపిక్‌లో అయినా నటించాల్సి వస్తే.. ఏ క్రికెటర్ బయోపిక్ చేస్తారు.? అని అడిగిన ప్రశ్నకు తడుముకోకుండా క్రికెటర్ విశ్వనాధ్ పేరు చెప్పారు.
ఆయనంటే తనకు చాలా ఇష్టమనీ, ఆయన బయోపిక్ స్క్రిప్ట్ తన వద్దకు వస్తే ఖచ్చితంగా నటిస్తా.. అని చెప్పారు. అలాగే కొన్ని షరతులు విధించారు. తాను నటించాలంటే.. ఆ బయోపిక్‌లో అంత శక్తివంతమైన డ్రామా వుండాలి.. అని చెప్పారు.
ఇంకేముంది.! హీరో రెడీ. ఎలాగూ హోమ్ బ్యానర్ సురేష్ ప్రొడక్షన్స్ వుంది కాబట్టి.. క్రికెటర్ విశ్వనాధ్ బయోపిక్ రెడీ చేస్తే వెంకటేష్ హీరోగా అతి త్వరలోనే ఆ ప్రాజెక్ట్ సిద్ధమైపోతుంది మరి. రచయితలూ, డైరెక్టర్లూ అందుకు సిద్ధమేనా.?
ఇకపోతే, విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం ‘సైంధవ్’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







