గాజా స్ట్రిప్‌లో కాల్పుల విరమణకు బహ్రెయిన్ డిమాండ్

- October 30, 2023 , by Maagulf
గాజా స్ట్రిప్‌లో కాల్పుల విరమణకు బహ్రెయిన్ డిమాండ్

బహ్రెయిన్: గాజా స్ట్రిప్‌లో కాల్పుల విరమణ పాటించాలని బహ్రెయిన్ విదేశాంగ మంత్రి, H.E. డాక్టర్ అబ్దులతీఫ్ బిన్ రషీద్ అల్ జయానీ కోరారు. బందీలు మరియు ఖైదీల విడుదల చేయాలని సూచించారు. పాలస్తీనియన్లకు మానవతా సహాయాన్ని అందించడం కోసం బహ్రెయిన్ రాజ్యం ముందుంటుందని పునరుద్ఘాటించారు.  పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సెక్రటరీ జనరల్, పాలస్తీనా ప్రభుత్వానికి చెందిన పలువురు సీనియర్ అధికారుల సమక్షంలో పాలస్తీనా రాష్ట్ర అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్‌ను ఆదివారం రమల్లాలో కలిసిన సందర్భంగా డాక్టర్ అల్ జయానీ మాట్లాడారు.  పౌరుల రక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని, అమాయకుల ప్రాణాలు కోల్పోయే ఏ చర్యనైనా ఖండించాలని, పిల్లల హత్యలకు వ్యతిరేకంగా అంతర్జాతీయ సమాజం ఐక్యంగా నిలబడాలని విదేశాంగ మంత్రి పేర్కొన్నారు.  గాజాలో మానవతావాద సంధికి పిలుపునిచ్చే తీర్మానాన్ని120 ఓట్లతో ఆమోదించినందుకు డాక్టర్ అల్ జయానీ ఆ UN జనరల్ అసెంబ్లీకి ధన్యవాదాలు తెలిపారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com