జపాన్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా దసరా ఉత్సవాలు

- October 30, 2023 , by Maagulf
జపాన్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా దసరా ఉత్సవాలు

టోక్యో: జపాన్‌లో ఉన్న తెలుగు కమ్యూనిటీ ఫామిలీ మెంబెర్స్ (ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ ప్రణవములు) దసరా పండగ సందర్బంగా జపాన్ దేశంలోని టోక్యో ఓజిమాలో దసరా ఉత్సవాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో 90 తెలుగు కుటుంబాలు కుటుంబ సందర్భానుసారం హాజరైనాయి. ఇందులో ఆటపాటలతో ,పిల్లలు ఉత్సాహంగా, ఉల్లాసంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ తెలుగు సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా జపాన్ దేశంలో పండుగలను తెలుగువారందరమూ కలసి జరుపుకుంటున్నామన్నారు. స్వగ్రామాల అభివృద్ధికి తోడ్పాటు అందిస్తూ మాతృభూమి రుణం తీర్చుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు గుంటూరు జగన్, రాయచోటి వెంకట్, రాయచోటి తిరుమల్ రెడ్డి, పృథ్వి, సాగర్, పృథ్వి, శ్రీధర్‌, కర్నూలు చంద్ర, హైదరాబాద్ శ్రీధర్, గుంటూరు రమేష్, వరంగల్ శ్రీనివాస రెడ్డి, విజయవాడ రవీంద్ర నాధ్ రెడ్డి, కడప దివాకర్ రెడ్డి, శిరీష్ తదితరులు పాల్గొన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com