'రైట్.. రైట్..' జూన్ 10న
- May 23, 2016
సుమంత్ అశ్విన్, పూజా ఝావేరి జంటగా నటించిన చిత్రం 'రైట్‌రైట్'. మను దర్శకత్వం వహించిన ఈ సినిమలో ప్రభాకర్ కీలక పాత్రధారి. శ్రీసత్య ఎంటర్టైనమెంట్స్ పతాకంపై జె.వంశీకృష్ణ నిర్మించారు. జూన్ 10న ప్రేక్షకుల ముందుకిరానుందీ సినిమా. సుమంత్ అశ్విన్ మాట్లాడుతూ ''లక్ష్యం కోసం తపించే ఓ కుర్రాడి కథ ఇది. లక్ష్య సాధనలో భాగంగా బస్సు కండక్టర్ అయిన ఆ కుర్రాడికి ఓ అందమైన అమ్మాయి తారసపడుతుంది. వారిద్దరి మధ్య ఎటువంటి అనుబంధం ఏర్పడింది? అతని లక్ష్యం ఏమైంది అనేది కథ. నేనిప్పటి వరకూ చేసిన పాత్రలకు భిన్నంగా ఉంటుంది. ఫస్టాఫ్ కామెడీగానూ, సెకెండాఫ్ మిస్టరీగా సాగుతుంది'' అని చెప్పారు. ''ఎస్.కోట నుంచి గవిటి వెళ్లే బస్సు ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తుంది. కామెడీ, లవ్, మిస్టరీతో ఆధ్యంతం ఉత్కంఠగా ఉంటుంది. సుమంత్ అశ్విన్ కెరీర్లోనే హయ్యెస్ట్ థియేటర్లలో ఈ నెల 10న విడుదల చేస్తున్నాం'' అని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: శేఖర్ వి. జోసఫ్, సంగీతం: జె.బి, మాటలు: డార్లింగ్ స్వామి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







