స్మార్ట్ సిటీల రెండో జాబితాలో తెలంగాణ రాష్ట్రం ..
- May 23, 2016
స్మార్ట్ సిటీల రెండో జాబితాలో తెలంగాణ రాష్ట్రం నుంచి వరంగల్ కు చోటు దక్కింది. 13 నగరాల పేర్లతో కూడిన స్మార్ట్ సిటీల రెండో జాబితాను మంగళవారం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్య నాయుడు విడుదల చేశారు. ఈ జాబితాలో లక్నో తొలి స్థానంలో నిలవగా, వరంగల్ 9వ స్థానంలో నిలిచింది.ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ..స్మార్ట్ సిటీస్ పథకానికి కేంద్రం నుంచి నిధులు ఇస్తున్నామని పేర్కొన్నారు. వంద ఆకర్షణీయమైన నగరాల్లో భాగంగా ఇప్పటికే 98 నగరాలను గుర్తించామన్నారు. రాష్ట్రాలతో సంప్రదించిన తర్వాతే కార్యక్రమాలను రూపొందిస్తున్నట్లు వెంకయ్య తెలిపారు. గతంలో ఢిల్లీ నుంచి గల్లీ వరకూ అనే నినాదం ఉండేదని, ఇప్పుడు గల్లీ నుంచి ఢిల్లీ వరకూ నినాదం చేపడుతున్నామన్నారు. కాగా తొలి విడత స్మార్ట్ సిటీల జాబితాలో ఒక్క పాయింట్ తేడాతో వరంగల్ అవకాశాన్ని కోల్పోయిన విషయం తెలిసిందే.
రెండో జాబితాలోని స్మార్ట్ సిటీలు 1. లక్నో (ఉత్తరప్రదేశ్) 2. భగల్ పూర్ (బిహార్) 3. న్యూ టౌన్, కోల్ కతా (పశ్చిమ బెంగాల్) 4. ఫరీదాబాద్ (హర్యానా) 5.ఛంఢీఘర్ 6.రాయ్ పూర్ (ఛత్తీస్ ఘర్) 7.రాంచీ (జార్ఖండ్) 8.ధర్మశాల (హిమాచల్ ప్రదేశ్) 9. వరంగల్ (తెలంగాణ) 10. పనాజీ (గోవా) 11. అగర్తలా (త్రిపుర) 12. ఇంపాల్ (మణిపూర్) 13. ఫోర్ట్ బ్లెయిర్ (అండమాన్ నికోబార్ దీవులు)
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







