యూఏఈలో నాన్-రెసిడెంట్స్ కోసం కొత్త టాక్స్ రూల్స్
- November 02, 2023
యూఏఈ: దేశంలోని కార్పొరేట్ పన్ను పరిధిలోకి వచ్చే నాన్-రెసిడెంట్లను నిర్ణయించేందుకు కొత్త గైడ్ లైన్స్ ను యూఏఈ ఫెడరల్ టాక్స్ అథారిటీ (FTA) విడుదల చేసింది. జూన్ 1, 2023 నుండి అమలులోకి వచ్చిన కార్పొరేట్ పన్ను చట్టంలో భాగంగా ఈ మార్పులను చేసినట్లు వెల్లడించింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. FTA అధికారిక వెబ్సైట్లో కొత్త మార్గదర్శకాలు ఉన్నాయని తెలిపింది.
FTA కొత్త గైడ్ లైన్స్ ప్రకారం.. నాన్-రెసిడెంట్ యూఏఈలో శాశ్వత సంస్థను కలిగి ఉండి మరియు సంవత్సరంలో AED1,000,000 కంటే ఎక్కువ టర్నోవర్ కలిగి ఉండేవారు, ఎమిరేట్స్ నుండి ఆదాయాన్ని పొందేవారుగా రెండు కేటగిరీలుగా నిర్ణయించారు. అదే విధంగా నాన్-రెసిడెంట్ జురిడికల్ వ్యక్తులు (కార్పొరేషన్లు) కార్పొరేట్ పన్నుకు లోబడి ఉండేందుకు నిర్దిష్ట ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని నిర్దేశించారు. నాన్-రెసిడెంట్ జురిడికల్ వ్యక్తులు కార్పొరేట్ పన్ను ప్రయోజనాల కోసం నమోదు చేసుకోవాల్సిన అవసరం ఉంది. వారు సంబంధిత ప్రమాణాలకు అనుగుణంగా పన్ను నమోదు సంఖ్య (TRN)ని పొందాలి. అయితే, ఎమియార్టెస్లో శాశ్వత స్థాపన లేదా అనుబంధం లేని నాన్-రెసిడెంట్ జురిడికల్ వ్యక్తులకు కార్పొరేట్ పన్ను నమోదు అవసరం లేదని FTA స్పష్టం చేసింది.కాగా, ఒక నాన్-రెసిడెంట్ నేచురల్ వ్యక్తి కార్పొరేట్ పన్ను ప్రయోజనాల కోసం నమోదు చేసుకోవాలని, యూఏఈలో వారి శాశ్వత స్థాపనకు ఆపాదించబడిన వారి టర్నోవర్ క్యాలెండర్ ఇయర్ లో AED1,000,000 మించి ఉంటే TRNని పొందాలని కొత్త గైడ్ లైన్స్ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- యూఏఈ–ఫ్రాన్స్ సంబంధాల బలోపేతంపై షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ చర్చలు
- హూతీల భీకర దాడి.. 53 మంది యెమెన్ సైనికులు మృతి
- నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలు (బాలల) నిర్వహణ తేదీల మార్పు
- భారత్–న్యూజిలాండ్ మధ్య రేపటి నుంచే FTA అమలు
- ఫ్లైదుబాయ్ విమాన ఘటన పై స్పందించిన భారత పైలట్ స్మిత్ మచ్చర్
- దుబాయ్‌లో ఘనంగా ఐపీఎఫ్ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ బతుకమ్మ సంబరాలు
- ఫ్యూచర్‌సిటీకి కొత్త పోలీస్ కమిషనరేట్.. ప్రారంభించిన సీఎం రేవంత్
- మలేషియాలో ఘనంగా MYTA 13వ గ్రాండ్ బతుకమ్మ వేడుకలు
- దుబాయ్‌లో నకిలీ అనారోగ్య సెలవు ధ్రువపత్రాల జారీ.. క్లినిక్ క్లర్క్‌కు జైలు శిక్ష
- నో పార్కింగ్ ప్రాంతాల్లో వాహనాలు నిలిపితే వీల్ క్లాంప్లు..!!







