బుర్జ్ ఖలీఫా నూతన సంవత్సర బాణాసంచా ప్రదర్శన.. టిక్కెట్లు ధరలు
- November 03, 2023
దుబాయ్: బుర్జ్ పార్క్ వద్ద బుర్జ్ ఖలీఫా వద్ద ప్రపంచ ప్రఖ్యాత న్యూ ఇయర్ ఈవ్ బాణాసంచా ప్రదర్శనను వీక్షించేందుకు నివాసితులు, సందర్శకులు టిక్కెట్లను కొనుగోలు చేయాలి. "ఎమ్మార్ నూతన సంవత్సర వేడుకలు అందరూ ఆస్వాదించడానికి ఉచితం అయినప్పటికీ, బుర్జ్ ఖలీఫా ముందు బుర్జ్ పార్క్‌లో ప్రత్యేకమైన టిక్కెట్ వీక్షణ అనుభవం పరిచయం చేయబడింది. ఇందు కోసం టికెట్ కొనుగోలు చేయాలి." అని ఎమ్మార్ ప్రాపర్టీస్ తెలిపింది. పెద్దలకు టికెట్ ధర Dh300 కాగా, అయితే 5 - 12 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలకు ప్రవేశ ధర Dh150గా నిర్ణయించారు. 5 ఏళ్లలోపు పిల్లలకు మాత్రం ప్రవేశం ఉచితం. నవంబర్ 10 నుండి ప్లాటినమ్‌లిస్ట్‌లో టిక్కెట్లను కొనుగోలు చేయవచ్చు. బుర్జ్ పార్క్ వీక్షణ ప్రదేశంలో ప్రత్యేకమైన Emaar NYE కోసం టిక్కెట్ హోల్డర్‌లు తమ బ్యాడ్జ్‌లను దుబాయ్ మాల్, దుబాయ్ హిల్స్ మాల్, దుబాయ్ మెరీనా మాల్ నుండి డిసెంబర్ 26-30 తేదీలలో మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు తీసుకోవచ్చు. బుర్జ్ పార్క్‌లోకి ప్రవేశించడానికి, నిర్దిష్ట ప్రాంతాలకు చేరేందుకు బ్యాడ్జ్ తప్పనిసరి అని పేర్కొంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!







