కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- October 09, 2026
కువైట్: పిల్లల్లో రీడింగ్ అలవాటును ప్రోత్సహించడంతో పాటు జ్ఞానాన్ని పంచుకునే ఉద్దేశంతో ఇండియన్ ఉమెన్ ఇన్ కువైట్ (IWIK) పుస్తక దాన కార్యక్రమాన్ని ప్రారంభించింది. తమ వద్ద అదనంగా ఉన్న పుస్తకాలను అవసరమైన వారికి అందించాలనుకునే వారు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని నిర్వాహకులు కోరారు.
ఇంట్లో ఉపయోగించకుండా ఉన్న కథల పుస్తకాలు, నవలలు, జనరల్ నాలెడ్జ్ (GK) పుస్తకాలు తదితరాలను డొనేట్ చేయవచ్చని తెలిపారు. పాత పుస్తకాలను దానం చేయడం ద్వారా వాటిని మరోసారి పిల్లలకు ఉపయోగపడేలా చేయడంతో పాటు, చదివే అలవాటును ప్రోత్సహించవచ్చని పేర్కొన్నారు. డొనేట్ చేసే పుస్తకాలను సేకరించిన అనంతరం, ప్రత్యేక కార్యక్రమంలో వాటిని తిరిగి పిల్లలకు పంపిణీ చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
పుస్తకాలకు ఉండాల్సిన నిబంధనలు
- 6 నుంచి 16 ఏళ్ల పిల్లలకు అనువైన పుస్తకాలు మాత్రమే డొనేట్ చేయాలి.
- పుస్తకాలు మంచి స్థితిలో ఉండాలి.
- చిరిగిన పేజీలు, దెబ్బతిన్న కవర్లు లేదా వదులుగా ఉన్న బైండింగ్ ఉన్న పుస్తకాలను స్వీకరించరు.
- పాఠశాల పుస్తకాలు, విద్యా సంబంధిత అకడమిక్ పుస్తకాలను స్వీకరించరు.
పుస్తకాలను డొనేట్ చేయాలనుకునే వారు ముందుగా రిజిస్టర్ చేసుకోవాలి. అనంతరం IWIK బృందం వారిని సంప్రదించి పుస్తకాల సేకరణకు సంబంధించిన వివరాలను తెలియజేస్తుంది. మరిన్ని వివరాల కోసం వాట్సాప్: 60617933ను సంప్రదించవచ్చు.
“పుస్తకాలను డొనేట్ చేయడం అంటే కేవలం పాత వస్తువును ఇవ్వడం కాదు.. ఒక కథను, ఒక జ్ఞానాన్ని మరొకరికి అందించడం” అని ఈ సందర్భంగా నిర్వాహకులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







