జగన్ అక్రమాస్తుల కేసు..సీబీఐకి సుప్రీంకోర్టు నోటీసులు
- November 03, 2023
న్యూఢిల్లీ: ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. జగన్ అక్రమాస్తుల కేసు విచారణలో జాప్యం జరుగుతోందని వైఎస్ఆర్సిపి రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. అంతేకాదు కేసు విచారణను హైదరాబాద్ నుంచి మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని కోర్టులో పిటిషన్ లో కోరారు. ఈ పిటిషన్ ను జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎన్వీఎన్ భట్టిల ధర్మాసనం విచారించింది. విచారణ సందర్భంగా జగన్ కేసులో విచారణ ఎందుకు ఆలస్యం అవుతోందని సీబీఐని ప్రశ్నించింది. విచారణ ఆలస్యానికి గల కారణాలు చెప్పాలంటూ సీబీఐకి నోటీసులు జారీ చేసింది. రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్ ను ఎందుకు విచారించకూడదో చెప్పాలని ఆదేశించింది. జగన్ సహా కేసులోని ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జనవరికి వాయిదా వేసింది.
తాజా వార్తలు
- రేపటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..
- తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి ఒంటిపూట బడులు
- యూఏఈకి ఫ్లైట్స్ తగ్గిస్తున్న భారత విమానయాన సంస్థలు..!!
- హవల్లీ, సల్మియాలో త్వరలో నీటి సరఫరా పునరుద్ధరణ..!!
- ఒమన్/మిడిల్ ఈస్ట్‌లో CBSE XII బోర్డు ఎగ్జామ్స్ రద్దు..!!
- ఖతార్ బార్డర్ ద్వారా ప్రయాణంపై ఎంబసీ సూచనలు..!!
- భారీ వర్షాలు.. ఆన్లైన్ పరిహార సర్వీసుకు ఆమోదం..!!
- సౌదీ కస్టమ్స్ పోర్టులలో 663 నిషిద్ధ వస్తువులు సీజ్..!!
- యూఏఈ లాటరీ విజేతలు..9వేల మంది విజేతలు..!!
- అనుమానాస్పద కార్యకలాపాలను నివేదించాలని ఖతార్ పిలుపు..!!









