గత 9 ఏళ్లలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో 50 వేల కోట్ల ఎఫ్‌డిఐ: ప్రధాని మోడీ
- November 03, 2023
న్యూఢిల్లీ: భారత ఆహార శుద్ధి పరిశ్రమ అద్భుతంగా పురోగమిస్తోందని ప్రధాని మోడీ తెలిపారు. గత తొమ్మిదేళ్లలో ఆహార శుద్ధి పరిశ్రమ 50 వేల కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించిందని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ విధానాల వల్లే. ఈస్థాయిలో ఎఫ్‌డీఐలు వచ్చాయని మోడీ తెలిపారు. ఢిల్లీలోని భారత మండపంలో జరిగిన వరల్డ్ ఫుడ్ ఇండియా 2023ను కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రి పశుపతి కుమార్ పరాస్తో కలిసి మోడీ ప్రారంభించారు.
ఈ కార్యక్రమం మూడు రోజుల పాటు కొనసానుంది. వరల్డ్ ఫుడ్ ఇండియా మొదటి ఎడిషన్ 2017లో జరిగగా అనంతరం కొవిడ్ కారణంగా కార్యక్రమం జరగలేదు. మూడురోజులపాటు జరిగే ఈ ఎడిషన్‌లో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలోని వివిధ అంశాలపై చర్చించేందుకు 48 సెషన్లు నిర్వహిస్తారు. ఆర్థిక సాధికారత, నాణ్యత హామీ, యంత్రాలు. సాంకేతికతలో ఆవిష్కరణలకు ప్రాధాన్యత ఇస్తారు. ప్రముఖ ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీల సీఈవోలతో సహా 80కిపైగా దేశాల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొంటారు.
ఫుడ్ స్ట్రీట్‌ను కూడా ప్రారంభించిన ప్రధాని మోడీ . అందులో కలియతిరిగి నిర్వాహకులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. తొమ్మిదేళ్ల ఎన్డీఏ పాలనలో శుద్ధిచేసిన ఆహార ఎగుమతులు 150 శాతం పెరిగాయని తెలిపారు. దేశీయ ప్రాసెసింగ్ సామర్థ్యం గణనీయంగా పెరిగిందని వెల్లడించారు.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







