సిట్రా రోడ్డు ప్రమాదంలో ఫిలిప్పినో మృతి
- May 24, 2016
ఫిలిప్పినోకి చెందిన ఓ వ్యక్తి సిట్రాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో ఐదుగురు వ్యక్తులకు గాయాలయ్యాయి. ఓ మినీ బస్సు, రెండు కార్లు రోడ్డు ప్రమాదానికి గురయ్యాయని, ప్రమాదంలో వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని పోలీసు అధికారులు వెల్లడించారు. మృతిచెందిన ఫిలిప్పినో వ్యక్తి ఫోర్డ్ కారుని డ్రైవ్ చేస్తున్నాడు. ప్రమాదం జరిగిన వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించినప్పటికీ, అతని ప్రాణాల్ని కాపాడలేకపోయారు. ప్రమాదానికి గురైన మరో కారుని బహ్రెయిన్కి చెందిన వ్యక్తి నడుపుతున్నాడు. ఆయనకు గాయాలయ్యాయి. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. ప్రమాదం చోటుచేసుకున్న తరువాత వాహనాల్లోనివారిని బయటకు తీయడానికి కట్టర్లను ఉపయోగించారు పోలీసులు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







