కువైట్‌తో తలపడనున్న భారత ఫుట్‌బాల్ జట్టు
- November 04, 2023
కువైట్: కువైట్‌లోని జాబర్ అల్-అహ్మద్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఫిఫా ప్రపంచ కప్ 2026 AFC క్వాలిఫైయర్స్ రెండో రౌండ్లో భారత ఫుట్‌బాల్ జట్టు కువైట్‌తో తలపడేందుకు సిద్ధంగా ఉంది. నవంబర్ 16( గురువారం)న సాయంత్రం 4:30 గంటలకు(కువైట్ కాలమానం ప్రకారం ) మ్యాచ్ జరుగుతుంది. 2026 FIFA వరల్డ్ కప్ క్వాలిఫికేషన్ AFC రెండవ రౌండ్లో ఖతార్, కువైట్ మరియు ఆఫ్ఘనిస్తాన్లతో పాటుగా భారత పురుషుల ఫుట్‌బాల్ జట్టు గ్రూప్ Aలో డ్రా ఉంది. క్వాలిఫైయర్ల తర్వాత ప్రతి గ్రూప్ నుండి మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు తదుపరి రౌండ్‌కు చేరుకుంటాయి. మిగిలినవి 2027 ఆసియా కప్ క్వాలిఫికేషన్లో మూడో రౌండ్‌కు చేరుకుంటాయి. నవంబర్ 21( మంగళవారం)న భారత కాలమానం ప్రకారం సాయంత్రం 7:00 గంటలకు భువనేశ్వర్‌లోని కళింగ స్టేడియంలో భారత జట్టు ప్రస్తుత ఆసియా ఛాంపియన్ ఖతార్‌తో తలపడనుంది. భారత సీనియర్ పురుషుల జట్టు ప్రధాన కోచ్ ఇగోర్ స్టిమాక్ శుక్రవారం తొలి రెండు మ్యాచ్‌లకు 28 మంది ప్రాబబుల్స్‌తో కూడిన జాబితాను ప్రకటించారు.
కువైట్ మరియు ఖతార్‌తో జరిగే మ్యాచ్‌ల కోసం 28 మంది జాబితా:
గోల్ కీపర్లు: అమ్రీందర్ సింగ్, గురుప్రీత్ సింగ్ సంధు, విశాల్ కైత్.
డిఫెండర్లు: ఆకాశ్ మిశ్రా, లాల్చుంగ్నుంగా, మెహతాబ్ సింగ్, నిఖిల్ పూజారి, రాహుల్ భేకే, రోషన్ సింగ్ నౌరెం, సందేశ్ జింగన్, సుభాసిష్ బోస్.
మిడ్ ఫీల్డర్లు: అనిరుధ్ థాపా, బ్రాండన్ ఫెర్నాండెజ్, గ్లాన్ పీటర్ మార్టిన్స్, లాలెంగ్మావియా, లిస్టన్ కొలాకో, మహేష్ సింగ్ నౌరెమ్, నందకుమార్ సేకర్, రోహిత్ కుమార్, సహల్ అబ్దుల్ సమద్, సురేష్ సింగ్ వాంగ్జామ్, ఉదాంత సింగ్ కుమామ్.
ఫార్వర్డ్లు: ఇషాన్ పండిత, లాలియన్జులా ఛంగ్టే, మన్వీర్ సింగ్, రాహుల్ కన్నోలి ప్రవీణ్, సునీల్ ఛెత్రి, విక్రమ్ పర్తాప్ సింగ్.
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!







