పాలస్తీనియన్ల పై ఇజ్రాయెల్ ఊచకోతను ఖండించిన ఒమన్
- November 05, 2023
మస్కట్: పాలస్తీనా ప్రజలకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ ఆక్రమణ దళాలు కొనసాగిస్తున్న మారణకాండపై ఒమన్ సుల్తానేట్ శనివారం తీవ్రంగా ఖండించింది. పౌరులు మరియు ఆరోగ్య రంగ సౌకర్యాలను లక్ష్యంగా చేసుకోవడంపై ఆందోళన వ్యక్తం చేసింది. ఉత్తర గాజా స్ట్రిప్‌లోని జబాలియాలోని UNRWAకి అనుబంధంగా ఉన్న అల్-ఫఖౌరా స్కూల్‌పై బాంబు దాడి జరిగింది. గాజా స్ట్రిప్‌కు దక్షిణాన ఉన్న రఫాకు తూర్పున అనేక పరిసరాలకు సరఫరా చేసే పబ్లిక్ వాటర్ ట్యాంక్‌పై బాంబు దాడి జరిగిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. ఇజ్రాయెల్ ఏకపక్షంగా దాడులకు తెగబడుతుందని, అంతర్జాతీయ ఉల్లంఘనకు ముగింపు పలికేందుకు అంతర్జాతీయ కలిసి రావాలని సుల్తానేట్ పిలుపునిచ్చింది. ఇజ్రాయెల్ యుద్ధ నేరాలను విచారించడానికి ఒక న్యాయస్థానాన్ని ఏర్పాటు చేయమని అంతర్జాతీయ క్రిమినల్ కోర్టును అభ్యర్థించింది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







