సినీ ఇండస్ట్రీ లో 30 ఏళ్ళు పూర్తి చేసుకున్న నాగ్
- May 24, 2016
నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన నాగార్జున తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో థర్టీ ఇయర్స్ కంప్లీట్ చేశారు. ముప్పై ఏళ్ళ క్రితం అన్నపూర్ణ సినీస్టూడియోస్ బ్యానర్లో వి.మధుసూదనరావు డైరెక్షన్లో తెరకెక్కిన 'విక్రమ్' మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు నాగ్. ఈ సినిమా1986 మే 23న రిలీజై విజయం సాధించింది. తర్వాత నాగార్జున హీరోగా వచ్చిన సినిమాలు పెద్దగా ఆకట్టుకోనప్పటికీ, దాసరి నారాయణరావు డైరెక్షన్లో వచ్చిన 'మజ్ను' నాగ్ కు మంచి ఇమేజ్ తీసుకొచ్చింది.
తర్వాత మళ్లీ సక్సెస్ దూరమైన నాగార్జున, 1989లో చేసిన 'గీతాంజలి, శివ' చిత్రాలు ఆయనకు అటు క్లాస్, ఇటు మాస్ ఇమేజ్ ను కట్టబెట్టాయి. తర్వాత నాగ్ నటించిన 'హలో బ్రదర్, నిన్నే పెళ్ళాడతా, నువ్వువస్తావని' మూవీస్ సక్సెస్ అయ్యాయి. తర్వాత మాస్, మన్మథుడు, నేనున్నాను, సంతోషం వంటి మూవీస్ చేశాడు నాగ్. కె.రాఘవేంద్రరావు డైరెక్షన్లో నాగార్జున నటించిన 'అన్నమయ్య' చిత్రం ఆయనలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించింది. మళ్లీ రాఘవేంద్రరావు దర్శకత్వంలోనే వచ్చిన 'శ్రీరామదాసు' సినిమా కూడా నాగార్జునకు మంచి పేరుతెచ్చిపెట్టింది. ఇక తండ్రి అక్కినేని నాగేశ్వరరావు నటించిన లాస్ట్ మూవీగా వచ్చిన 'మనం' లో అక్కినేని నటవంశానికి చెందిన మూడుతరాల హీరోలు కలసి నటించారు. ఇక ఈఏడాది సంక్రాంతికి వచ్చిన 'సోగ్గాడే చిన్నినాయనా' , తరువాత వచ్చిన 'ఊపిరి' మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇక త్వరలో 'హాథీరామ్ బాబా'గా మరోమారు తనలోని భక్తి రసాన్ని బయటపెట్టబోతున్నాడు నాగ్.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







