జైల్లో నిరాహార దీక్షకు దిగిన నోబెల్ శాంతి బహుమతి గ్రహీత నర్గీస్ మొహమ్మది
- November 07, 2023
టెహ్రాన్: నోబెల్ శాంతి బహుమతి-2023 గ్రహీత నర్గీస్ మొహమ్మది సోమవారం జైలులో నిరాహారదీక్షకు దిగారు. అనారోగ్యసమస్యలో బాధపడుతున్న ఆమెను హిజాబ్ ధరించి ఆస్పత్రికి వెళ్లాల్సిందేనని అధికారులు స్పష్టం చేశారు. అందుకు ఆమె నిరాకరించడంతో గతవారం గుండె, ఊపిరితిత్తుల చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్లేందుకు అధికారులు అనుమతించలేదని మానవ హక్కుల కమిటీ తెలిపింది.
'ఈ రోజు నర్గీస్ నిరాహార దీక్షకు దిగారు. ఇస్లామిక్ రిపబ్లిక్ విధానం, అనారోగ్యంతో ఉన్న ఖైదీల సంరక్షణను ఆలస్యం చేయడం, ఫలితంగా వారు తీవ్ర అనారోగ్యం పాలవ్వచ్చు లేదా ప్రాణాలను కోల్పోవచ్చు. రెండు ఇరాన్ మహిళలకు మరణం లేదా తప్పనిసరి హిజాబ్ విధానం'ఈ రెండింటినీ వ్యతిరేకిస్తూ ఆమె నిరాహారదీక్షకు దిగినట్లు ఓ ప్రకటనలో పేర్కొంది.
నర్గీస్ గుండె, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారని, కానీ జైలు అధికారులు హిజాబ్ ధరించకుండా ఆస్పత్రికి అనుమతించేందుకు తిరస్కరించారని ఆమె కుటుంబసభ్యులు పేర్కొన్నారు. కేవలం ఓఆర్ఎస్ (ఉప్పు, చక్కెర కలిపిన నీరు) మాత్రమే తీసుకుంటున్నారని, మెడిసిన్ తీసుకోవడం లేదని తెలిపారు.
నర్గిస్‌కు వైద్య సేవలను నిరాకరించడంపై నోబెల్ కమిటీ తీవ్రంగా స్పందించింది. ఆస్పత్రిలో చేరాలంటే మహిళా ఖైదీలు తప్పనిసరిగా హిజాబ్ ధరించాలనే నిబంధన అమానవీయమని ఓ ప్రకటనలో పేర్కొంది. ఇది అనైతికమని.. ఆమెకు తక్షణమే వైద్య సహాయం అందించాలని అధికారులను కోరింది.
ఇరాన్లో మహిళల హక్కుల కోసం పోరాటం చేస్తున్న ఆమెను ఇరాన్ అధికారులు ఇటీవల అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఆమె 13 సార్లు అరెస్టు అయ్యారు. ఐదుసార్లు జైలు శిక్షలను ఎదుర్కొన్నారు. 154 కొరడా దెబ్బలు కూడా తిన్నారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







