గాజాలో కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ నో.. సహాయ సామగ్రి తరలింపునకు ఓకే
- November 07, 2023
యూఏఈ: గాజాలో సహాయ సామగ్రి ప్రవేశం లేదా బందీల నిష్క్రమణను సులభతరం చేయడానికి "వ్యూహాత్మక చిన్న విరామాలను" పరిశీలిస్తుందని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు తెలిపారు. అయితే అంతర్జాతీయ ఒత్తిడి పెరుగుతున్నప్పటికీ సాధారణ కాల్పుల విరమణ కోసం చేసిన పిలుపులను మళ్లీ తిరస్కరించారు. గాజాలో హమాస్ ఉగ్రవాదులను పూర్తిగా తుడిచిపెట్టేవరకు తమ పోరాటం ఆగదని నెతన్యాహు స్పష్టం చేశారు. సోమవారం అమెరికాన్ టెలివిజన్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. యుద్ధం తర్వాత కూడా పాలస్తీనా ఎన్‌క్లేవ్‌పై ఇజ్రాయెల్‌కు భద్రతా పరమైన బాధ్యతలను తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలిపారు. మొదటగా ఇజ్రాయెల్‌పై హమాస్ రాకెట్ దాడులు పాల్పడింది. ఇందులో 1,400 మంది ఇజ్రాయెలీలు మరణించారు. మరో 240 మందికి పైగా బందీలను హమాస్ బందీలుగా గాజాలోకి తీసుకెళ్లింది. అనంతరం ఇజ్రాయెల్ గాజాపై వైమానికి దాడులు దిగింది. ప్రస్తుతుం గాజాలోకి ప్రవేశించిన ఇజ్రాయెలీ సైన్యం హమాస్ తో నేరుగా యుద్ధం చేస్తుంది. ఇజ్రాయెల్ దాడులలో ఇప్పటివరకు10,022 మంది పాలస్తీనియన్లు మరణించారని, వీరిలో 4,104 మంది పిల్లలు ఉన్నారని హమాస్-నియంత్రిత ఎన్‌క్లేవ్‌లోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. యుద్ధం మొదలై నవంబర్ 7తో నెల రోజులు దాటింది.
తాజా వార్తలు
- ఫోన్‌పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం