ఇర్రిటేబుల్ బోవెల్ సిండ్రోవ్గు నుండి విముక్తి ఎలా..?
- May 24, 2016
ఈ నవీన యుగంలో చాలా మందిని వేధిస్తున్న సమస్య ఐబిఎస్ (ఇర్రిటేబుల్ బోవెల్ సిండ్రోవ్గు). దీనికి కారణం మారిన జీవనశైలి విధానాలే అని చెప్పవచ్చు. క్షణం తీరిక లేక కాలంతో పరుగులు, వేళకు తీసుకోని ఆహారం, చీటికి మాటికి చిరాకు, కారణం లేకుండానే కోపం, వీటితో పాటు నిత్యం ఎదుర్కొనే రకరకాల మానసిక ఒత్తిళ్లు తోడు కావడంతో ఐబిఎస్ సమస్య తీవ్రరూపం దాలుస్తోంది. లక్షణాలుతేన్పులు ఎక్కువగా ఉండటం.గ్యాస్‌తో పొట్ట మొత్తం ఉబ్బినట్లుగా ఉండటం.కడుపులో గడబిడలతో పుల్లటి తేప్పులు రావడం.మల విసర్జన సరిగా కాదు. నీళ్ళ వీరోచనాలు, జిగట విరోచనాలు.తిన్నది సరిగ్గా జీర్ణం కాకపోవడం, వాంతులు కావడం.
జీవన విధానం సక్రమంగా జరగక మానసిక ఒత్తిడి పెరుగుతుంది.జాగ్రత్తలుఫాస్ట్ ఫుడ్స్. ఆయిల్ ఫుడ్స్, మసాలాలు, వేపుళ్లు మానేయాలి. ఆల్కహాలు మానేయాలి.నిలువ ఉంచిన పచ్చళ్లు తినడం మానాలి. వేళకు ఆహారం తీసుకోవాలి.నీరు సరిపడినంతంగా తాగాలి.మానసిక ఒత్తిడిని నివారించడానికి యోగా, మెడిటేషన్ వంటివి చేయాలి. టీ, కాఫీలు మానేయాలి.చికిత్సహోమియో వైద్యంలో ఐబిఎస్‌తో బాధపడేవారికి మంచి చికిత్స ఉంది. శారీరక, మానసిక లక్షణాల ఆధారంగా మందులను ఎంపిక చేసుకొని ఇవ్వడం వల్ల వ్యాధి సమూలంగా నివారణ అవుతుంది.మందులునక్స్‌వామికా:మసాలాలు, ఫాస్ట్‌ఫుడ్స్, కాఫీలు ఎక్కువగా సేవించడం, శారీరక శ్రమ తక్కువగా ఉండి, మానసిక శ్రమ ఎక్కువగా ఉన్న వారికి ఈ మందు ఆలోచించదగి నది. మానసిక స్థాయిలో వీరికి కోపం ఎక్కువ. శబ్దాలు, వెలుతురు భరించలేరు. ఇటువంటి లక్ష ణాలు ఉన్న వారికి ఈ మందు బాగా పని చేస్తుంది.అర్జెంటం నైట్రికం:పొట్టలో నొప్పి ఉండి తేన్పులు ఉంటాయి. తిన్న తరువాత పొట్టలో నొప్పి ప్రారంభమవుతుంది. వీరు మానసిక స్థాయిఓ ఆందోళన చెందుతుం టారు. ఎక్కడికైనా వెళ్లవలసి వచ్చినా ఎవరైనా వస్తున్నారని తెలిసినా ఏదైనా పని తలపెట్టినా గందరగోళంలో పడిపోతారు.ఎనాకార్డియం: వీరికి పొట్టలో నొప్పి ఏదైనా తిన్న తరుఆత తాత్కాలికంగా తగ్గుతుంది. మళ్లీ నొప్పి రెండు గంటల తరువాత మొదలవడం గమనించ దగిన లక్షణం. వీరు మానసిక స్థాయిలో మతిమరుపు ఎక్కువగా ఉండి, దుర్భాషలాడే స్వభావంతో ఉంటారు. ఇటువంటి వారికి ఈ మందు బాగా పని చేస్తుంది.ఆర్సినికం ఆల్బం:ఈ మందు జీర్ణాశయ వ్యాధులకు తప్పక ఆలోచించదగినది. కడుపులో గడబిడలతో తేన్పులు రావడంతో పాటు వాంతికి వచ్చినట్లుగా అనిపించడం, నీళ్ల వీరోచనాలు, జిగట విరోచ నాలు, తరుచుగా దాహం, ఒళ్లునొప్పులు, మానసిక స్థాయిలో ఆందోళన భయం వంటి లక్షణాలున్న వారికి ఈ మందు వాడుకోదగినది.ఫాస్ఫరస్: పొట్టలో అల్సర్ ఉండి వీరికి రక్తం కూడా పడుతుంటుంది. విపరీతమైన నొప్పి ఉంటుంది. చల్లటి పదార్థాలు ఐస్‌క్రీంలు తింటే నొప్పి ఉపశమిస్తుంది. వీరు మానసిక స్థాయిలో భయస్థులు. ఉరుములు, మెరుపులు అంటే భయపడతారు. ఇటువంటి లక్షణాలు ఉన్న వారికి ఈ మందు ప్రయోజనకారి.ఈ మందులే కాకుండా గ్రాఫైటిస్ ఇపికాక్, బ్రయోనియా, సల్ఫర్, కార్బొవెజ్, చైనా, లైకోపోడియం వంటి మందులను లక్షణ సముదాయాన్ని అనుసరించి వాడితే ఐబిఎస్ నుండి విముక్తి పొందవచ్చు.
తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్‌లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









