మేక తలకాయమాంస రసం
- May 24, 2016
కావలసిన పదార్ధాలు :
మేకతలకాయ మాంసం : అరకేజీ
ఉల్లిపాయలు : మూడు
పచ్చిమిర్చి : మూడు
అల్లంవేల్లుల్లి పేస్టు : టేబుల్ స్పూన్
కారం : టేబుల్ స్పూన్
ఉప్పు : తగినంత
పసుపు : అర టీ స్పూన్
గరం మసాల : 1 టీ స్పూన్
టమాటా : ఒకటి
కొత్తిమిర : చిన్న కట్ట
దనియాల పొడి : 1 టీ స్పూన్
గసాల పేస్ట్ : 1 టీ స్పూన్
తయారుచేయు విధానం :
1) తలకాయ మాంసం (మేక కాళ్ళుకూడా) కడిగి ఉప్పు, కారం, పసుపు, అల్లంవెల్లుల్లి, ధనియాల పొడి, కొద్దిగా కొత్తిమిర, గసాల పేస్ట్ వేసి బాగాకలిపి అరగంట పక్కన పెట్టాలి.
2) ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి నూనెవేసి వేడిచేయ్యాలి.
3) నూనె కాగాక ఉల్లి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేగాక, అల్లంవెల్లుల్లి వేసి కాసేపు వేపాలి.
4) టమాటా ముక్కలు కూడా వేసి మగ్గనిచ్చి, అన్నీ కలిపినమాంసం వేసి ఒక నిముషం కలిపి, లీటరు నీళ్ళువేసి మూతపెట్టాలి.
5) అరగంట (విజిల్ పెట్టకూడదు) ఉడకనివ్వాలి.
6) ఇప్పుడు అర లీటరు రసం వరకు వచ్చాక, గరం మసాల, కొత్తిమిర వేసి మూత పెట్టి స్టవ్ ఆపాలి.
* అంతే మేకమాంస రసం రెడి.
* ఇది వేడిగా ఉన్నప్పుడే అన్నంలో వేసుకొని తింటే జలుబు తగ్గిపోతుంది.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







