గూగుల్ సహాయంతో ఇండియన్ మ్యూజియం..
- May 24, 2016
ఇటీవల 360 డిగ్రీల రూపంలో(విస్తృత వీక్షణ) ఉన్న వీడియోలు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు కోల్‌కతలోని ఇండియన్ మ్యూజియానికి సంబంధించిన వీడియోను గూగుల్ సహాయంతో అందుబాటులోకి తీసుకురానున్నారు. మ్యూజియంలోని బౌద్ధకళ, గాంధార సంస్కృతి శిల్పాలను ఈ వీడియోలో చేర్చనున్నారు.'ఇండియన్ బుద్ధిస్ట్' పేరుతో ఈ రోజు (బుధవారం) నెట్‌లో విడుదల చేస్తారు. ప్రపంచంలోని ప్రముఖ కళాఖండాలని తమ వెబ్‌సైట్‌లో చేర్చే కార్యక్రమంలో భాగంగా గూగుల్ దీన్ని చేపట్టింది. మ్యూజియం డెరైక్టర్ జయంత్ సేన్‌గుప్తా మాట్లాడుతూ...'మ్యూజియంలోని కళాఖండాలన్నింటినీ గూగుల్ వెబ్ సైట్‌లో చేర్చబోతున్నాం. ఈ వీడియోని మీరు అన్ని కోణాల్లో తిప్పి చూసుకోవచ్చు' అని అన్నారు. గూగుల్ దీనికోసం యూకే, యూఎస్‌కి చెందిన ప్రత్యేక కెమెరాలను వినియోగించిదని సేన్‌గుప్తా వివరించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







