టామ్‌కామ్ కు ఆశించిన స్పందన లభించడం లేదు..
- May 24, 2016
రాష్ట్రంలోని నిరుద్యోగులకు విదేశాల్లో ఉద్యోగ అవకాశాల కల్పన కోసం ఏర్పాటు చేసిన తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీస్ (టామ్‌కామ్)కు విస్తృత ప్రచారం కల్పించాలని కార్మిక శాఖ నిర్ణయించింది. టామ్‌కామ్ ఆన్‌లైన్ సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చి నెల రోజులు కావొస్తున్నా ఆశించిన స్పందన లభించడం లేదు. ఇప్పటివరకు కేవలం 30 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి.దీంతో టామ్‌కామ్‌వల్ల కలిగే ఉపయోగాలపై అవగాహన కల్పించడం కోసం లఘు చిత్రాల ప్రసారం, కరప్రతాల పంపిణీ చేయాలని కార్మిక శాఖ నిర్ణయిం చింది. మొదటి దశలో ఐదు చిత్రాలను టీవీలు, సినీ థియేటర్లలో ప్రసారం చేయాలని భావిస్తోంది. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే ఒకట్రెండు రోజుల్లో కార్యాచరణ ప్రారంభించనుంది. గల్ఫ్ దేశాల్లో ఉద్యోగాల కోసం యువత దళారులను ఆశ్రయించి మోసపోతున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉద్యోగాలు కల్పించాలని టామ్‌కామ్‌కు రూపకల్పన జరిగింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







