పట్టణ పేదలకు ఇంటింటికీ నల్లా కనెక్షన్
- May 24, 2016
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్ పెట్టిస్తానని, లేకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగబోమని కేసీఆర్ ఇప్పటి వరకు చాలా సమావేశాల్లోనే ప్రసంగించిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇచ్చిన మాట ప్రకారమే ఆ లక్ష్యం దిశాగా అడుగులు వేయడం ప్రారంభించింది తెలంగాణ ప్రభుత్వం. పట్టణాల్లో నివసిస్తున్న పేదలకు రూపాయికే నల్లా కనెక్షన్ ఇచ్చే దిశగా ప్రణాళికలను సిద్ధం చేసింది తెలంగాణ సర్కార్. నీటి కోసం నానా తిప్పలు పడి బకెట్ నీళ్లు తెచ్చుకొనే విధానానికి స్వస్తి పలకనుంది కేసీఆర్ ప్రభుత్వం.
ఒక్క రూపాయి చెల్లించి నల్లా కనెక్షన్ పొందేలా పట్టణ పేదలకు అవకాశం కల్పిస్తూ రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్క రూపాయికే నల్లా కనెక్షన్ సదుపాయాన్ని రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, నగరాల్లోని పేదలకు వర్తింపజేస్తారు. గతంలో తెల్ల రేషన కార్డు కలిగిన వారిని పేదలుగా గుర్తించారు. ఇప్పుడవి అమలులో లేకపోవడంతో... ఆసరా పెన్షన అర్హతకు రూపొందించిన నిబంధనలను దీనికి వర్తింపజేస్తున్నారు.
ఆసరాకు అర్హత పొందాలంటే కుటుంబ వార్షికాదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.5 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలుగా పేర్కొన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే నిబంధనను నల్లా కనెక్షనకు కూడా అమలు చేస్తున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తద్వారా రాష్ట్రంలో కనీసం 5నుంచి 9.5లక్షల వరకు కొత్తగా నల్లా కనెక్షన్లు ఇవ్వాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు. పట్టణ సమస్యలపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.పట్టణ పేదలకు ఇంటింటికీ నల్లా కనెక్షన్ వెనుక ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న మిషన భగీరథ ప్రాజెక్టు ఉంది. ఈ ప్రాజెక్ట్‌లో రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, గ్రామాలు, ఆవాసాలలో ఇంటింటికీ నల్లా కనెక్షన్ ద్వారా నీరందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. గ్రామాలు, ఆవాసాలకు ఆర్‌డబ్ల్యుఎస్ శాఖ ద్వారా నీటిని సరఫరా చేస్తారు. పట్టణాలకు బల్క్‌గా నీరందిస్తే, అంతర్గత పంపిణీని సంబంధిత మున్సిపాలిటీలు చూసుకోవాలి. ఈ క్రమంలోనే నిరుపేదలు సహా ప్రతి ఒక్కరూ నల్లా కనెక్షన్ తీసుకునేలా ఈ ఒక్క రూపాయి రుసుము విధానం తీసుకువచ్చారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









