తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆత్మ బలిదానాలు చేసుకున్న అమరుల కు సర్కారు ఉద్యోగాలు
- May 24, 2016
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆత్మ బలిదానాలు చేసుకున్న అమరుల కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి బీఆర్ మీనా మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. ఉద్యోగానికి ఎంపిక చేసే వ్యక్తికి ఉండాల్సిన వయోపరిమితి, విద్య వంటి కనీస అర్హతలను ప్రభుత్వం సడలించింది. ఇప్పటికే ఒక్కో కుటుంబానికి రూ. 10 లక్షల చొప్పున ఆర్థికసాయం అందజేసిన ప్రభుత్వం, ఇల్లు, ఉచిత విద్య, ఆరోగ్య సదుపాయం, వ్యవసాయం చేసుకునే కుటుంబమైతే భూమి ఇవ్వాలని నిర్ణయిం చింది. అమరుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించేందుకు జిల్లాల కలెక్టర్లను అపాయింటింగ్ అథారిటీగా నియమించిం ది. ఈ మేరకు పాటించాల్సిన మార్గదర్శకాలను ఉత్తర్వుల్లో సూచించింది.మార్గదర్శకాలివే.. కుటుంబంలో ఉద్యోగానికి ఎంపిక చేసే వ్యక్తికి ఎలాంటి వయోపరిమితి అక్కర్లేదు. చివరి గ్రేడ్ ఉద్యోగానికి అవసరమైన విద్యార్హతను సదరు వ్యక్తి ఐదేళ్లలోగా పొందేందుకు అవకాశం కల్పించారు. అర్హత ఉన్నవారు జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాన్ని కోరుకుంటే, అవసరమైతే రోస్టర్ పాయింట్లలోనూ రిలాక్సేషన్ ఇవ్వాలని ప్రభుత్వం సూచించింది. కుటుంబసభ్యుల అనుమతితో రక్త సంబంధీకులు ఎవరికైనా ఉద్యోగం ఇవ్వవచ్చు. భార్య లేదా భర్త ఆ తర్వాత పిల ్లలకు ప్రాధాన్యతను ఇవ్వాలి. జిల్లా కలెక్టర్లకు.. అవసరమైతే నిబంధనలను సడలించుకునే అధికారాన్ని ప్రభుత్వం కల్పించింది. ప్రస్తుతం ఉన్న ఖాళీల్లో నియామకాలు జరపాలని, అవసరమైతే సూపర్ న్యూమరరీ పోస్టులను సృష్టించుకోవచ్చని పేర్కొంది. మార్గదర్శకాలను అనుసరించి ఉద్యోగ నియామకపత్రాలను జారీచేయాలని ఆదేశించింది.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









