ఇజ్రాయెల్ చేసిన నేరాలపై దర్యాప్తు చేయాలి.. అరబ్-ఇస్లామిక్ దేశాల డిమాండ్
- November 13, 2023
రియాద్: ఇజ్రాయెల్‌కు ఆయుధాలు, మందుగుండు సామగ్రి ఎగుమతులపై నిషేధం విధించాలని రియాద్‌లో జరిగిన అసాధారణ అరబ్-ఇస్లామిక్ సమ్మిట్ పిలుపునిచ్చింది. పాలస్తీనా ప్రజలకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ చేసిన నేరాలపై దర్యాప్తు చేయాలని అంతర్జాతీయ క్రిమినల్ కోర్టును కోరింది. గాజా స్ట్రిప్‌పై విధించిన దిగ్బంధనాన్ని తొలగించాలని, ఇంధనంతో సహా మానవతా సహాయాన్ని వెంటనే అనుమతించాలని శిఖరాగ్ర సమావేశం డిమాండ్ చేసింది. పాలస్తీనియన్లను ఉత్తర గాజా నుండి దక్షిణ భాగానికి లేదా గాజా స్ట్రిప్, వెస్ట్ బ్యాంక్ మరియు జెరూసలేం వెలుపలకు వెళ్లగొట్టాలనే ప్రయత్నాలను తీవ్రంగా ఖండించింది. గాజాపై ఇజ్రాయెల్ దాడిని ఆపాలని యూఎన్ భద్రతా మండలిని కోరింది. గాజాపై ప్రతీకార యుద్ధాన్ని "ఆత్మ రక్షణ"గా అభివర్ణించడాన్ని సమ్మిట్ తిరస్కరించింది. గాజాపై ఉన్న దిగ్బంధనాన్ని తక్షణమే ఎత్తివేయాలన, తక్షణ సహాయాన్ని అందించాలని కోరింది. గాజాపై ఇజ్రాయెల్ దురాక్రమణను ఆపాలని ఐరాస భద్రతా మండలి నిర్ణయాత్మక తీర్మానం చేయాలని శిఖరాగ్ర సమావేశం కోరింది.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







