మెడికల్ మిరాకిల్: 45 నిమిషాల తర్వాత చనిపోయిన వ్యక్తికి మళ్లీ ప్రాణం!
- November 13, 2023
యూఏఈ: ఈ వారం ప్రారంభంలో ఖోర్ఫక్కన్ హాస్పిటల్లో గుండెపోటుతో బాధపడుతున్న ఒక వ్యక్తి 45 నిమిషాల తర్వాత తిరిగి ప్రాణం పోసుకున్న ఘటన నమోదైంది. ఖోర్ఫక్కన్ హాస్పిటల్ డాక్టర్లు తెలిపిన వివరాల ప్రకారం.. ముప్పై ఏళ్ల వయస్సు ఉన్న రోగి.. సక్రమంగా గుండె కొట్టుకోవడం లేదని ఆసుపత్రికి వచ్చారు. అక్కడ ఉండగానే అతని గుండె ఆగిపోయింది. వెంటనే డాక్టర్లు కార్డియోపల్మోనరీ రిససిటేషన్ (CPR) చేయడం ప్రారంభించారు. కరోనరీ ఆర్టరీ థ్రాంబోసిస్‌తో బాధపడుతున్న రోగికి 17 ఎలక్ట్రికల్ షాక్‌లు, 15 డోసుల గుండె-స్టిమ్యులేటింగ్ అడ్రినలిన్ ఇచ్చారు. రోగికి గుండె పునరుజ్జీవనంతో పాటు క్లాట్-కరిగే ఏజెంట్ కూడా ఇంజెక్ట్ చేశారు. ఎలక్ట్రో కార్డియోగ్రామ్ (ECG) ఫలితాల ప్రకారం.. రోగి ఆకస్మిక కార్డియాక్ అరెస్ట్ తర్వాత కార్డియాలజిస్ట్ నిర్వహించిన కార్డియాక్ అసెస్మెంట్లో తీవ్రమైన కరోనరీ బ్లాక్ ఉన్నట్లు వెల్లడైంది. అతన్ని వెంటనే ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU)కి తరలించారు. అక్కడ అతన్ని వెంటిలేటర్‌పై ఉంచారు. కరోనరీ యాంజియోగ్రఫీ ప్రక్రియ కోసం అతనిని ఫుజైరా ఆసుపత్రికి తరలించారు. ఫుజైరా హాస్పిటల్‌లోని కార్డియాలజీ బృందం కరోనరీ ఆర్టరీలో ఎటువంటి అడ్డంకులు లేదా గడ్డకట్టడం లేదని నిర్ధారించారు. అనంతరం, చికిత్స కొనసాగించడానికి రోగిని తిరిగి ఖోర్ఫక్కన్ ఆసుపత్రికి తరలించారు. ఫాలో అప్ కార్డియాక్ అల్ట్రాసౌండ్ కార్డియాక్ పనితీరులో గణనీయమైన అభివృద్ధిని నమోదు చేసి, గుండె పనితీరు 55 శాతానికి చేరుకుంది. అనంతరం అతను ఇంటర్నల్ మెడిసిన్ విభాగానికి తరలించారు. రోగి ఖోర్ఫక్కన్ హాస్పిటల్లో మొత్తం 8 రోజులు, ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో 2 రోజులు, ఇంటర్నల్ మెడిసిన్ విభాగంలో 6 రోజులు చికిత్స పొంది కోలుకున్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో ఐదేళ్లలో రెట్టింపైన ప్రైవేట్ జెట్ రాకపోకలు..!!
- సౌదీ రియల్ ఎస్టేట్ ధరల్లో వార్షికంగా 1.2% పెరుగుదల..!!
- ఒమన్‌లో వరుస కేబుల్ చోరీల నిందితుడు అరెస్ట్..!!
- కువైట్ పాఠశాలల్లో చైనీస్ భాష.. ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు..!
- నవంబర్ నాటికి ముహర్రఖ్ సూక్ రోడ్డు పనులు పూర్తి..!
- పాలపిట్టలను బంధిస్తే చట్టపరమైన చర్యలు: సీపీ సజ్జనార్
- ఖతార్‌లో కొత్త ప్రాంతీయ రక్షణ భాగస్వామ్యం.. త్వరలో కీలక ప్రకటన..!
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతంపై చర్చలు.. ముంబైలో జైశంకర్‌తో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ భేటీ
- టైగర్ ప్రాఫ్ ను చంపేందుకు రూ.35వేల సుపారీ!
- ప్రపంచ చరిత్రలోనే తొలిసారి ఉక్రెయిన్ అద్భుత రెస్క్యూ ఆపరేషన్







