బహ్రెయిన్‌లో అన్ని జాతీయులకు మతపరమైన స్వేచ్ఛ
- November 13, 2023
బహ్రెయిన్: బహ్రెయిన్ రాజ్యం మత స్వేచ్ఛను రక్షించడానికి మరియు విభిన్న సంస్కృతుల మధ్య సాంస్కృతిక సంభాషణను బలోపేతం చేయడానికి కట్టుబడి ఉందని క్రౌన్ ప్రిన్స్ మరియు ప్రధాన మంత్రి రాయల్ హైనెస్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా తెలిపారు. దీపావళి పండుగను పురస్కరించుకుని హెచ్ఆర్హెచ్ ప్రిన్స్ సల్మాన్ నిన్న ముల్జిమల్, కేవల్రామ్, థాకర్, కావలిని కుటుంబాలను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హిస్ మెజెస్టి కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా చూపిన బాట బహ్రెయిన్‌ను శాంతి మరియు సామరస్యానికి స్వర్గధామంగా బలోపేతం చేసిందన్నారు. రాజ్యంలో దీపావళి వేడుకలు బహ్రెయిన్ సమాజంలో వైవిధ్యాన్ని కాపాడటంలో నిబద్ధతను చూపుతాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఇసా బిన్ సల్మాన్ ఎడ్యుకేషన్ ఛారిటబుల్ ట్రస్ట్ ట్రస్టీల బోర్డు చైర్మన్, లేబర్ ఫండ్ (తమ్కీన్) డైరెక్టర్ల బోర్డు చైర్మన్ షేక్ ఇసా బిన్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా కూడా అనేక హిందూ కుటుంబాలను సందర్శించారు. భాటియా, వైద్య, నాయర్, అసర్పోటా కుటుంబాలకు HRH ప్రిన్స్ సల్మాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. హెచ్ఆర్హెచ్ ప్రిన్స్ సల్మాన్, హెచ్‌హెచ్ షేక్ ఇసా బిన్ సల్మాన్‌తో పాటు పలువురు సీనియర్ అధికారులు కూడా ఉన్నారు.
తాజా వార్తలు
- యూఏఈ–ఫ్రాన్స్ సంబంధాల బలోపేతంపై షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ చర్చలు
- హూతీల భీకర దాడి.. 53 మంది యెమెన్ సైనికులు మృతి
- నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలు (బాలల) నిర్వహణ తేదీల మార్పు
- భారత్–న్యూజిలాండ్ మధ్య రేపటి నుంచే FTA అమలు
- ఫ్లైదుబాయ్ విమాన ఘటన పై స్పందించిన భారత పైలట్ స్మిత్ మచ్చర్
- దుబాయ్‌లో ఘనంగా ఐపీఎఫ్ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ బతుకమ్మ సంబరాలు
- ఫ్యూచర్‌సిటీకి కొత్త పోలీస్ కమిషనరేట్.. ప్రారంభించిన సీఎం రేవంత్
- మలేషియాలో ఘనంగా MYTA 13వ గ్రాండ్ బతుకమ్మ వేడుకలు
- దుబాయ్‌లో నకిలీ అనారోగ్య సెలవు ధ్రువపత్రాల జారీ.. క్లినిక్ క్లర్క్‌కు జైలు శిక్ష
- నో పార్కింగ్ ప్రాంతాల్లో వాహనాలు నిలిపితే వీల్ క్లాంప్లు..!!







