‘దేవర’ కోసం మరో ‘నాటు నాటు’ రేంజ్ సాంగ్
- November 14, 2023
‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో ‘నాటు నాటు..’ సాంగ్ ఆస్కార్ విన్నింగ్‌లో నిలిచిన సంగతి తెలిసిందే. ప్రపంచం మొత్తం ఓ ఊపు ఊపేసింది ఈ పాట.
ఇప్పుడు ఈ తరహాలోనే మరో సాంగ్ ప్లాన్ చేస్తున్నారు. అది ఎన్టీయార్ నటిస్తున్న ‘దేవర’ కోసం. ‘దేవర’ సినిమాకి అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ అందిస్తున్న సంగతి తెలిసిందే.
ఇక, ఎన్టీయార్లాంటి హీరోకి అనిరుధ్ అందించబోయే మ్యూజిక్ ఎలా వుండబోతోంది.? ఖచ్చితంగా దద్దరిల్లిపోతుంది. దీపావళి టపాస్ లాంటి ఓ సాంగ్‌ని ఆల్రెడీ కంపోజ్ చేశాడట అనిరుధ్.
ఈ పాట సినిమాకి ఖచ్చితంగా హైలైట్ అవుతుందనీ, ‘నాటు నాటు..’ సాంగ్‌ని బీట్ చేసే ప్లానింగ్‌తో సిద్ధం చేస్తున్నారనీ తెలుస్తోంది.
ఇక, ఈ సాంగ్‌లో ఎన్టీయార్ స్టెప్పులు నభూతో న భవిష్యతి అనే స్థాయిలో వుండబోతున్నాయట. ఏకంగా 2000 మంది డాన్సర్లతో ఈ సాంగ్‌ని ప్రేమ్ రక్షిత్ కంపోజ్ చేయబోతున్నారట.
ప్యాన్ ఇండియా మూవీగా రూపొందబోతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు.
తాజా వార్తలు
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్‌లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్‌లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!







