‘బేబీ’ బాగా పెంచేసిందట.!
- November 14, 2023
‘బేబీ’ సినిమాతో యూ ట్యూబర్ అయిన వైష్ణవీ చైతన్య దశ ఎలా తిరిగిపోయిందో తెలిసిందే. ఒక్క సినిమాతో సెన్సేషనల్ అయిపోయింది వైష్ణవీ చైతన్య.
సాయి రాజేష్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల పంట పండించడంతో హీరో సంగతెలా వున్నా.. హీరోయిన్గా డెబ్యూ చేసిన వైష్ణవీ చైతన్య క్రేజ్ మాత్రం ఓ రేంజ్లో పెరిగిపోయింది.
ఈ క్రేజ్‌తోనే వరుసగా నాలుగు సినిమాలకు టక టకా సైన్ చేసేసింది వైష్ణవీ చైతన్య. అందులో తన డెబ్యూ హీరో ఆనంద్ దేవరకొండ సినిమా కూడా ఒకటి.
ఇక, తాజాగా దిల్ రాజు నిర్మాణంలో వైష్ణవీ చైతన్య ఓ సినిమాకి సైన్ చేసిందట. అరుణ్ భీమవరపు ఈ సినిమాతో డైరెక్టర్‌గా పరిచయమవుతున్నారు.
అసలు మ్యాటర్ ఏంటంటే, ఈ సినిమాకి భారీ రెమ్యునరేషన్ అందుకుంటోందట వైష్ణవీ చైతన్య. దాదాపు కోటికి దగ్గరగా అంటున్నారు. ఒకవేళ నిజమే అయితే, నిజంగానే వైష్ణవీ చైతన్య రేంజ్ పెరిగిపోయినట్లే.
టాలీవుడ్లో స్టార్స్‌గా కొనసాగుతున్న హీరోయిన్లకు వైష్ణవి గట్టి పోటీనే అని చెప్పొచ్చు. అయితే, తూచ్.! అంత సీను లేదు.. అంటూ ఇంకొందరు ఈ ప్రచారాన్ని కొట్టి పడేస్తున్నారు. నిజమేంటో తెలియాల్సి వుంది.
తాజా వార్తలు
- మస్కట్‌లో పార్కింగ్ సర్వే ప్రారంభం..!!
- త్వరలో ఆటోమేటిక్ వెహికల్ ఇన్ ఫెక్షన్ సెంటర్ ప్రారంభం..!!
- జిసిసి ప్రతినిధులతో అమీర్ సమావేశం..!!
- ‘శ్రావణం’ ఓనం ఉత్సవంలో గ్రాండ్ కాన్సర్ట్..!!
- కొత్త చట్టం.. గరిష్టంగా SR20,000 జరిమానా..!!
- యూఏఈ ప్రవాసిని వరించిన Dh1 మిలియన్ లాటరీ..!!
- ఫోన్‌పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!