‘యానిమల్’ని తెలుగు ఆడియన్స్ లైట్ తీసుకుంటారా.?
- November 14, 2023
రణ్‌బీర్ కపూర్, రష్మిక మండన్నా జంటగా బాలీవుడ్‌లో తెరకెక్కుతోన్న సినిమా ‘యానిమల్’. ఈ మధ్య బాలీవుడ్, టాలీవుడ్ అనే తేడా లేకుండా ఇండియన్ సినిమాగా సినిమా ఇండస్ట్రీ చెలామణీ అవుతున్న నేపథ్యంలో తెలుగు సినిమాలు హిందీలోనూ, హిందీ ఇతర భాషా సినిమాలు తెలుగులోనూ డైరెక్ట్ రిలీజ్ అవుతున్నాయ్.
ఆ నేపథ్యంలోనే ‘యానిమల్’ సినిమా కూడా తెలుగులో గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది. డిశంబర్ 1న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో సినిమాకి ప్రమోషన్లు గట్టిగా జరుగుతున్నాయ్.
తెలుగు సినిమా ‘అర్జున్ రెడ్డి’తో సెన్సేషన్ అయిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాకి దర్శకుడు కావడంతో మరింత హైప్ వుంది సినిమాపై.
నేషనల్ క్రష్ రష్మిక మండన్నా హీరోయిన్ అవ్వడం మరో అస్సెట్. కాగా, ఈ సినిమా తండ్రి సెంటిమెంట్‌తో తెరకెక్కుతోందన్న హింట్ అయితే ఇచ్చేశారు. తండ్రి పాత్రలో సీనియర్ బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ నటిస్తున్నారు.
తాజాగా ఈ సినిమా నుంచి ‘నాన్న నువ్వు నా ప్రాణం’ అనే సాంగ్ రిలీజ్ చేశారు. ఈ పాట తెలుగు ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అవుతోంది. ఇప్పటికే తెలుగులో ఈ తరహాలో చాలా చాలా సినిమాలొచ్చాయ్.
‘నాన్నకు ప్రేమతో’, ‘హైపర్’ తదితర సినిమాలు నాన్న సెంటిమెంట్ సినిమాలే. మంచి ఆదరణ దక్కించుకున్నాయ్ కూడా. అలా ‘యానిమల్’ కూడా ఆదరణ దక్కించుకుంటుందా.? లేక, తెలుగు ఆడియన్స్ లైట్ తీసుకుంటారా.? అనేది చూడాలి మరి.
తాజా వార్తలు
- ఫోన్‌పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం